‘పాక్ టీం మొత్తాన్ని వెనక్కి పంపేస్తాం’

‘పాక్ టీం మొత్తాన్ని వెనక్కి పంపేస్తాం’

Cricket: పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ సీఈఓ తమ క్రికెటర్లకు హెచ్చరికలు జారీ చేశాడు. న్యూజిలాండ్ టూర్ లో ఉన్న తమ జట్టు కొవిడ్-19ప్రొటోకాల్స్ తప్పక పాటించాలని లేదంటే జట్టు మొత్తానికి రిస్క్ తప్పదని తమ ఇళ్లకు పంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. గురువారం వసీం ఖాన్ నుంచి పాకిస్తాన్ ప్లేయర్లకు ఫైనల్ వార్నింగ్‌ వాట్సప్ వాయీస్ నోట్‌లో వచ్చింది.

ఆ దేశంలో అడుగుపెట్టిన తర్వాత పాక్ ప్లేయర్లు ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ‘వాళ్లు నాకు స్ట్రైట్ గా ఒకటే చెప్పారు. ఇంకొక్క కేసు బయటపడ్డా టీం మొత్తాన్ని వెనక్కి పంపేస్తామన్నారు’ అని సీఈఓ ఉర్దూ భాషలో రెండు నిమిషాల రికార్డింగ్ మెసేజ్ పంపాడు. చివర్లో ఇది చాలా చికాకు పుట్టే అంశం అని కూడా అన్నాడు.



అక్కడి టీవీ ఫుటేజిలో కొందరు ప్రొటోకాల్స్ అతిక్రమించి ప్రవర్తించారు. ఐసోలేషన్ లో ఉండాల్సిన వారు దానిని బ్రేక్ చేశారు. ఇప్పటికీ అలాంటి పొరబాట్లు మూణ్నాలుగు చేసినట్లు ఖాన్ చెప్పారు.

వారు దీనిని లెక్కచేసేలా లేరు. ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. ఇది చాలా కష్టమైన సమయమని తెలుసు. ఇంగ్లాండ్ లో ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొన్నారు. ఇది దేశ గౌరవం, మర్యాదలకు సంబంధించిన విషయం. 14రోజుల వరకూ అబ్జర్వేషన్ లో ఉండండి. ఆ తర్వాతనే న్యూజిలాండ్ హోటల్స్, రెస్టారెంట్లు తిరిగేందుకు మీకు అనుమతి లభిస్తుంది. ప్రొటోకాల్స్ పూర్తిగా పాటించండి’ అని అందులో ఉంది.