IND vs SA, 2nd ODI: ముగిసిన భారత్ ఇన్నింగ్స్.. స్కోరు 287/6

సౌతాఫ్రికాతో జరుగుతున్న కీలక రెండో వన్డే పార్ల్‌లోని బోలాండ్ పార్క్ వేదికగా జరుగుతోంది.

IND vs SA, 2nd ODI: ముగిసిన భారత్ ఇన్నింగ్స్.. స్కోరు 287/6

South Africa

IND vs SA 2nd ODI: సౌతాఫ్రికాతో జరుగుతున్న కీలక రెండో వన్డే పార్ల్‌లోని బోలాండ్ పార్క్ వేదికగా జరుగుతోండగా.. రెండో వన్డేలో తొలుత ఆడిన భారత్ దక్షిణాఫ్రికాకు 288 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ తరఫున వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ అత్యధికంగా 85 పరుగులు చేశాడు. పంత్ తన ఇన్నింగ్స్‌లో 71 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో అదరగొట్టాడు. చివర్లో శార్దూల్ ఠాకూర్ 38 బంతుల్లో 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

దక్షిణాఫ్రికా తరఫున తబ్రైజ్ షమ్సీ 57 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. వీరితోపాటు సిసంద మగల, ఐడెన్‌ మర్‌క్రామ్‌, కేశవ్‌ మహరాజ్‌, ఆండిలే ఫెహ్లుక్వాయోలకు తలా ఒక్క వికెట్ దక్కింది.

హాఫ్ సెంచరీలతో రాణించిన రిషబ్ పంత్, కేఎల్ రాహుల్:
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకోగా.. తొలి పది ఓవర్ల వరకు, రాహుల్ మొదట బ్యాటింగ్ తీసుకోవడం సరైనదని అనిపించింది. ధావన్, రాహుల్ తొలి వికెట్‌కు 11.4 ఓవర్లలో 63పరుగులు జోడించారు. 38బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 29 పరుగుల వద్ద ధావన్ ఔటయ్యాడు. ఐదన్ మార్క్రామ్ పెవిలియన్‌కు పంపాడు. దీని తర్వాత విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన కోహ్లీ పరుగులేమీ చెయ్యకుండానే అవుట్ అయ్యాడు.

64 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత ఇన్నింగ్స్‌ను రిషబ్ పంత్, కెప్టెన్ కేఎల్ రాహుల్ చక్కదిద్దారు. పంత్ 71 బంతుల్లో 85 పరుగులు చేయగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. రాహుల్ 79 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 55 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్, పంత్ మూడో వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

వీరిద్దరూ ఔట్ అయిన వెంటనే వేగంగా దూసుకెళ్తున్న భారత్ ఇన్నింగ్స్ ఆగిపోయింది. శ్రేయాస్ అయ్యర్ 14 బంతుల్లో 11 పరుగులతో ఔట్ కాగా, వెంకటేష్ అయ్యర్ 33 బంతుల్లో 22 పరుగులు చేశాడు. దీంతో తొలి మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ చేసిన శార్దూల్‌ ఠాకూర్‌ ట్రబుల్‌షూటర్‌గా మారాడు. మూడు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో శార్దూల్ 38 బంతుల్లో 40పరుగులు చేశాడు. మరోవైపు రవిచంద్రన్ అశ్విన్ 24 బంతుల్లో 25 పరుగులతో నాటౌట్ గా వెనుదిరిగాడు. అశ్విన్ ఒక ఫోర్, సిక్స్ కొట్టాడు.