స్పీడ్ చెస్ ఫైనల్‌లో పోరాడి ఓడిన హాంపి

  • Published By: vamsi ,Published On : July 20, 2020 / 12:16 PM IST
స్పీడ్ చెస్ ఫైనల్‌లో పోరాడి ఓడిన హాంపి

మహిళల స్పీడ్ చెస్ టోర్నమెంట్ నాల్గవది అయిన చివరి దశ ఫైనల్లో భారత టాప్ ప్లేయర్, ప్రపంచ రెండో ర్యాంకర్‌ కొనేరు హంపి రష్యాకు చెందిన అలెగ్జాండ్రా కోస్టెనియుక్ చేతిలో 5-7 తేడాతో ఓడిపోయింది. వరల్డ్ రాపిడ్ ఛాంపియన్ హంపి మొదటి గేమ్‌లో ఓడిపోయిన తర్వాత స్కోరును సమం చేయడానికి చివరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది.

ఆదివారం జరిగిన టోర్నీ నాలుగో అంచె ఫైనల్లో హంపి 5-7 తేడాతో పరాజయం పాలైంది. సెమీస్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ హోయు ఇఫాన్‌ను ఓడించిన హంపి ఫైనల్‌కు చేరుకుంది. టోర్నీ సూపర్‌ ఫైనల్‌లో అన్నా యుషేనినా(ఉక్రెయిన్‌)తో అలెగ్జాండ్రా తలపడనుంది.

కోస్టెనియుక్ 24 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఉషెనినా 22 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచింది. సెమీస్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ చైనాకు చెందిన హౌ యిఫాన్‌ను ఓడించిన హంపి 10 పాయింట్లతో ఏడవ స్థానంలో నిలిచింది.