Women’s T20I Player Rankings: టాప్ 20లో రిచా ఘోష్.. స్మృతి మంధాన ర్యాంక్ ఎంతో తెలుసా

Women's T20I Player Rankings: భారత మహిళల క్రికెట్ వికెట్ కీపర్-బ్యాటర్ రిచా ఘోష్ కెరీర్ లో బెస్ట్ టీ20 ర్యాంక్ సాధించింది. 16 స్థానాలు మెరుగుపరుచుకుని టాప్20లోకి ప్రవేశించింది.

Women’s T20I Player Rankings: టాప్ 20లో రిచా ఘోష్.. స్మృతి మంధాన ర్యాంక్ ఎంతో తెలుసా

Women’s T20I Player Rankings: భారత మహిళల క్రికెట్ వికెట్ కీపర్-బ్యాటర్ రిచా ఘోష్ కెరీర్ లో బెస్ట్ టీ20 ర్యాంక్ సాధించింది. 16 స్థానాలు మెరుగుపరుచుకుని టాప్20లోకి ప్రవేశించింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన T20I ర్యాంకింగ్స్‌లో 20వ స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ లో మంచి స్కోర్లు చేయడంతో ఆమె ర్యాంక్ మెరుగైంది. గత వారం మహిళల T20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై 41 పరుగులు, ఇంగ్లండ్‌పై 47 పరుగులతో ఘోష్ అజేయంగా రాణించడంతో ఆమె కెరీర్‌లో అత్యుత్తమ స్థానానికి చేరుకుంది.

T20I ర్యాంకింగ్స్‌ టాప్20లో చోటు దక్కించుకున్న 5వ భారత బ్యాటర్ రిచా ఘోష్. స్మృతి మంధాన (3), షఫాలీ వర్మ (10), జెమిమా రోడ్రిగ్స్ (12), హర్మన్‌ప్రీత్ కౌర్ (13) టాప్ 20లో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా క్రీడాకారిణులు తహ్లియా మెక్‌గ్రాత్, బెత్ మూనీ మొదటి రెండు ర్యాంకుల్లో ఉన్నారు.

Also Read: మరో మలుపు తిరిగిన సెల్ఫీ వివాదం.. పృథ్వీ షాపై క్రిమినల్ కేసు పెట్టిన నటి

న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమేలియా కెర్, పాకిస్థాన్‌కు చెందిన మునీబా అలీ కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకింగ్స్ సాధించిన ఇతర బ్యాటర్లు. పార్ల్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కెర్ చేసిన 66 పరుగులతో ఆమె కెరీర్‌లో అత్యుత్తమ 16వ స్థానానికి చేరుకుంది. పాకిస్థాన్‌కు చెందిన లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ మునీబా 10 స్థానాలు ఎగబాకి 64వ ర్యాంక్‌కు చేరుకుంది. పాకిస్తాన్ తరపున T20I సెంచరీ చేసిన మొదటి మహిళగా ఆమె రికార్డు కెక్కింది.