Lovlina Borgohain : బాక్సింగ్‌లో భారత్‌కు పసిడి పంట.. WBCలో 4వ గోల్డ్

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. పవర్ ఫుల్ పంచ్ లతో పసిడి పతకాలు కొల్లగొడుతున్నారు.

Lovlina Borgohain : బాక్సింగ్‌లో భారత్‌కు పసిడి పంట.. WBCలో 4వ గోల్డ్

Lovlina Borgohain : ఢిల్లీలో జరుగుతున్న మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. పవర్ ఫుల్ పంచ్ లతో పసిడి పతకాలు కొల్లగొడుతున్నారు. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ కు నాలుగో స్వర్ణం దక్కింది.

75కిలోల విభాగంలో భారత బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ గోల్డ్ మెడల్ సాధించింది. ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్ కైట్లిన్ పార్కర్‌ను 5-2 తేడాతో ఓడించి.. పసిడి సాధించింది. లవ్లీనా బోర్గోహైన్ కు.. ఇదే తొలి ప్రపంచ ఛాంపియన్‌షిప్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.(Lovlina Borgohain)

Also Read..Women’s World Boxing: వరుసగా రెండోసారి ప్రపంచ ఛాంపియన్‭గా నిఖత్ జరీన్.. WBCలో గోల్డ్

తొలి రౌండ్ ను లవ్లీనా చేజిక్కించుకోగా, రెండో రౌండ్ లో పార్కర్ పుంజుకుంది. ఆ తర్వాత వరుసగా మూడు రౌండ్లలోనూ లవ్లీనా ఆధిపత్యం కొనసాగింది. ఫైనల్ బౌట్ ను లవ్లీనా 4-1తో గెలిచి భారత్ కు స్వర్ణం అందించింది.

కాగా, అంతకుముందు 50 కిలోల విభాగంలో నిఖత్ జరీన్ పసిడి పతకం సాధించి సత్తా చాటింది. నిన్న నీతూ గాంగాస్(48 కిలోలు), స్వీటీ బూరా(81 కిలోలు) కూడా గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నారు. దీంతో భారత్ మొత్తం 4 బంగారు పతకాలు కైవసం చేసుకుంది. 2006 నుంచి ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లలో భారత్ కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.

ఇక, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ పసిడి పంచ్ విసిరింది. 50 కిలోల కేటగిరీలో నిఖత్ జరీన్ స్వర్ణం సాధించింది. ఫైనల్ బౌట్ లో వియత్నాం బాక్సర్ ఎన్ గుయెన్ థి టామ్ పై 5-0తో గెలుపొందింది నిఖత్. 28-27, 28-27, 28-27, 29-26, 28-27తో న్యాయనిర్ణేతలందరూ నిఖత్ జరీన్ వైపే మొగ్గుచూపారు. కాగా, ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిష్ చరిత్రలో నిఖత్ జరీన్ కు ఇది రెండో స్వర్ణ పతకం. 2022లో 52 కిలోల విభాగంలో నిఖత్ వరల్డ్ చాంపియన్ గా నిలిచింది.

𝗥𝗨𝗟𝗘𝗥 𝗢𝗙 𝗧𝗛𝗘 𝗥𝗜𝗡𝗚! 💥#WorldChampionships #WBCHDelhi pic.twitter.com/rRpv08juJN

— Doordarshan Sports (@ddsportschannel) March 26, 2023

 

రెండవసారి ప్రపంచ ఛాంపియన్ అయినందుకు సంతోషంగా ఉందన్నారు నిజామాబాద్ కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్. తనను సపోర్ట్ చేసిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తాను సాధించిన పతకం దేశానికి అంకితం చేశారామె. ఇది చాలా కష్టమైన పోటీ అయినప్పటికీ చివరికి నేను బంగారు పతకం సాధించాను అని ఆనందం వ్యక్తం చేశారు బాక్సర్ నిఖత్ జరీన్.

Also Read..Saweety Boora : మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో స్వర్ణం

గతంలో నిఖత్ సాధించిన పతకాలు..

* 2011 ప్రపంచ జూనియర్, యూత్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం
* 2014 నేషన్స్ కప్ లో స్వర్ణం
* 2015 జాతీయ సీనియర్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం
* 2018 సెర్బియాలో జరిగిన టోర్నీలో స్వర్ణం
* 2019 థాయ్ లాండ్ ఓపెన్ లో రజతం
* 2019, 2022లో స్ట్రాంజా మెమోరియల్ లో స్వర్ణం
* 2022 ఇస్తాంబుల్ లో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం
* 2022 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం
* 2023 ఐబీఏ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో మరో స్వర్ణం