Virat Kohli: “తలెత్తుకునేలా చేశారు.. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం”

వరల్డ్ కప్ పోరులో నిలవాలంటే భారత్ తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో ఉత్కంఠ పరిస్థితుల మధ్య ఓటమికి గురైంది. 274/4 స్కోరును నమోదు చేసి సౌతాఫ్రికా ముందు భారీ లక్ష్యం ఉంచినప్పటికీ..

Virat Kohli: “తలెత్తుకునేలా చేశారు.. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం”

Virat Kohli

Virat Kohli: వరల్డ్ కప్ పోరులో నిలవాలంటే భారత్ తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో ఉత్కంఠ పరిస్థితుల మధ్య ఓటమికి గురైంది. 274/4 స్కోరును నమోదు చేసి సౌతాఫ్రికా ముందు భారీ లక్ష్యం ఉంచినప్పటికీ ఆఖరి ఓవర్ చివరి బంతి వరకూ ఆడారు. చివరి ఓవర్లో సౌతాఫ్రికా విజయానికి 7 పరుగులు కావాల్సి ఉంది.

టీమిండియా బౌలర్ దీప్తి శర్మ నాలుగు బంతులకు నాలుగు పరుగులు ఇచ్చింది. ఇంకా రెండు బంతులకు కావాల్సింది మూడు పరుగులు. ఆ ఒత్తిడి పెరిగిపోయిన సమయంలో రెండు బాల్స్ కు రెండు పరుగులతో పాటు నో బాల్ కూడా వేయడంతో యావత్ ఇండియా ఆశలకు నీరు పోసినట్లైంది.

దీనిపై విరాట్ కోహ్లీ రెస్పాండ్ అయ్యాడు. ”మహిళా జట్టు టోర్నీ నుంచి తప్పుకున్నప్పటికీ చివరివరకూ పోరాడిన తీరు అద్భుతం. శక్తి మేర కృషి చేశారు. మమ్మల్ని గర్వపడేలా చేశారు” అంటూ విరాట్ ట్విట్టర్ లో పోస్టు పెట్టాడు.

Read Also: కోహ్లీ రికార్డుకు 4పరుగుల దూరంలో రోహిత్ శర్మ

దీనిపై సెహ్వాగ్ కూడా స్పందించారు ”అది కేవలం నో బాల్ మాత్రమే కాదు. భారత మహిళా జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కొన్నిసార్లు అంగుళం స్పేస్ కూడా ఎన్నో ఏళ్ల శ్రమను వృథా చేస్తుంది” అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.