T20 World Cup 2021: భారత్ ఆడితేనే పాకిస్తాన్ ఆడుతుందట

T20 World Cup 2021: భారత్ ఆడితేనే పాకిస్తాన్ ఆడుతుందట

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీం ఖాన్ శనివారం సంచలన ప్రకటన చేశారు. ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వడంలో బంగ్లాదేశ్‌తో ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. పాకిస్తాన్‌ మరికొద్ది రోజుల్లో జరగనున్న ఆసియా కప్‌కు ఆతిథ్యం వహించనుంది. ఈ క్రమంలో భారత్.. పాకిస్తాన్ లో పర్యటించేందుకు నిరాకరిస్తే తాము టీ20 వరల్డ్ కప్ 2021 ఆడేందుకు సిద్ధంగా లేమని ప్రకటించారు. 

‘ఇది పీసీబీ లేదా ఐసీసీ పంతం కాదు. వేదిక మార్చాలంటే ఆసియా క్రికెట్ కౌన్సిల్ మీద ఆధారపడి ఉంటుంది’ అని వసీం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ‘ఈ టోర్నమెంట్‌కు రెండింటిలో ఒకదానిని వేదికగా ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఈ మ్యాచ్ లలో భారత్ ఆడేందుకు నిరాకరిస్తే టీ20 వరల్డ్ కప్ 2021లో ఆడేందుకు మేం కూడా సుముఖంగా లేము’ అని ఆయన అన్నాడు. 

ఈ నెలారంభంలో బంగ్లాదేశ్.. పాకిస్తాన్ గడ్డపై ఆతిథ్య జట్టుతో ఆడేందుకు ఒప్పుకుంది. ఆసియా కప్ ను పాకిస్తాన్ లో నిర్వహిస్తున్నందుకే ఈఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వినిపించాయి. 2020 సెప్టెంబరులో ఆసియా కప్‌ను పాకిస్తాన్ వేదికగా నిర్వహిస్తే టీ20 వరల్డ్ కప్ 2021 భారత్ లో జరగనుంది.