అదే బాగా కలిసొచ్చింది: పీవి సింధు

అదే బాగా కలిసొచ్చింది: పీవి సింధు

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకున్న పీవి సింధుతో 10tv ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్హహించింది. ఓడిపోతాననుకున్న క్వార్టర్స్‌లో తై జుంగ్‌పై గెలవడం ఈవెంట్‌లో గెలిచేందుకు మరింత ఉత్సాహాన్నందించిందని సింధు తెలిపారు. టోర్నీ గెలుస్తాననే నమ్మకంతో ముందుగానే తన తల్లికి బర్త్ డే గిఫ్ట్ గా టైటిల్ ఇవ్వాలనుకున్న సింధు మరిన్ని విషయాలు ఇలా పంచుకుంది. 

ప్రతి మ్యాచ్ నాకు ముఖ్యమే. క్వార్టర్స్ లో తై జుంగ్‌పై తలపడి గెలవడం బాగా కలిసొచ్చింది. ఇదే నాలో ఉత్సాహాన్ని పెంచింది. నాపై కోచ్ లు ఎంతో విశ్వాసం వచ్చారు. కష్టపడితే మళ్లీ సాధించగలమనే నమ్మకాన్ని పెంచారు. గెలిచిన తర్వాత శ్రమ అంతా మర్చిపోతాం. 

జాతీయ గీతం వింటుంటే గర్వంగా అనిపించింది. నా విజయంలో సగం నా తల్లిదండ్రులదే. ఓడిపోయినప్పుడు పేరెంట్స్ నుంచి ప్రోత్సాహం వచ్చింది. ఫైనల్ కు ముందు మా అమ్మకు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా. అనుకున్నట్లే ఇచ్చా. ఇది నాకు చాలా బెస్ట్ గిఫ్ట్ అని ఆమె చెప్పింది. ఇందులో సగం విజయం వారిదేనని అనుకుంటున్నా. నా గెలుపులో వారి ఆనందం చూసుకున్నారు. 

ఓడిన సమయాల్లోనూ కోచ్‌లు నాకెంతో సహకారం అందించారు. మ్యాచ్ అయిన తర్వాత కన్నీళ్లు వచ్చాయి. జాతీయ గీతం వినిపిస్తున్నప్పుడు ఎలా ఫీలవ్వాలో తెలియలేదు. పరాయిదేశంలో మన జెండా ఎగురుతుంటే అదొక అద్భుతమైన ఫీలింగ్. 

కష్టపడేటప్పుడు చాలా అనిపిస్తుంది. ఒక్కసారి గెలవాలని సంకల్పించుకుని ఆడితే కచ్చితంగా గెలవగలం. ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ కు ప్రిపేర్ అవుతున్నా. 2020టైటిల్ సాధించడమే నా లక్ష్యం.