నేరుగా ఒలింపిక్స్ 2020కి వినేశ్ ఫోగట్

నేరుగా ఒలింపిక్స్ 2020కి వినేశ్ ఫోగట్

భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ కాంస్య పతకం సాధించి ఒలింపిక్స్ 2020కు అర్హత సాధించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో బంగారు పతకం సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన వినేశ్.. టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ మాత్రం ఖాయం చేసుకుంది. బుధవారం జరిగిన రెపిఛేజ్‌ పోరులో అమెరికా క్రీడాకారిణి సారా హల్దెబ్రాండ్ 8-2తేడాతో ఓడించింది. సారా ప్రపంచం రజత పతక విజేత కావడం గమనార్హం. 

పతకం సాధించిన అనంతరం వినేశ్ ఫోగట్ మాట్లాడుతూ.. ఇది ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో నా తొలి మెడల్. ఇటువంటి టోర్నీలో పతకం గెలవడం చాలా పెద్ద విషయం. ‘ అని తెలిపింది.  

ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో వినేశ్ కాంస్యం గెలవాలంటే గ్రీస్ అమ్మాయి మరియా ప్రెవోలరకిని ఓడించాల్సి ఉంది. రెఫిచేజ్ తొలి రౌండ్లో యులియా (ఉక్రెయిన్)ను వినేశ్ 5-0తో చిత్తు చేసింది. కాంస్యంపై ఆశలు సజీవంగా ఉంచుకుంది.