WTC Final 2023: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు ముందు ఆస్ట్రేలియాను భ‌య‌పెడుతున్న చెత్త రికార్డు

ప్ర‌తిష్టాత్మ‌క ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా జ‌ట్టును ఓ విష‌యం తీవ్రంగా క‌ల‌వ‌ర‌పెడుతోంది. లండ‌న్‌లోని కెన్నింగ్టన్ ఓవ‌ల్ మైదానంలో జూన్ 7 నుంచి 11 వ‌ర‌కు డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్ భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నుంది.

WTC Final 2023: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు ముందు ఆస్ట్రేలియాను భ‌య‌పెడుతున్న చెత్త రికార్డు

Kennington Oval

WTC Final-Australia: ప్ర‌తిష్టాత్మ‌క ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్(WTC Final 2023) మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా(Australia) జ‌ట్టును ఓ విష‌యం తీవ్రంగా క‌ల‌వ‌ర‌పెడుతోంది. లండ‌న్‌లోని కెన్నింగ్టన్ ఓవ‌ల్(Kennington Oval) మైదానంలో జూన్ 7 నుంచి 11 వ‌ర‌కు డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్ భార‌త్‌(Team India), ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. ఇందుకోసం ఇప్ప‌టికే రెండు జ‌ట్లు లండ‌న్ చేరుకుని ప్రాక్టీస్‌ను మొద‌లెట్టేశాయి.

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో ఎదురైన ప‌రాభ‌వానికి బ‌దులు తీర్చుకోవాల‌ని ఆసీస్ ప‌ట్టుద‌ల‌గా ఉండ‌గా.. 2013 ఛాంపియ‌న్ ట్రోఫీ విజేగా నిలిచిన టీమ్ఇండియా మ‌రో ఐసీసీ టైటిల్‌ను గెల‌వ‌లేదు. దీంతో ఆస్ట్రేలియాను మ‌ట్టిక‌రిపించి దాదాపు 10 ఏళ్ల నిరీక్ష‌ణ‌ను తెర‌దించాల‌ని టీమ్ఇండియా బావిస్తోంది.

WTC Final 2023: న‌యావాల్‌ మారిపోయాడా..! టీమ్‌తో క‌లిసి ప్ర‌యాణం చేయ‌డం లేదు.. సొంత కారులో.. ఆశ్చ‌ర్య‌పోయిన జ‌డేజా

ఇదిలా ఉంటే.. ఫైన‌ల్ మ్యాచ్‌కు ముందు ఓ విష‌యం ఆస్ట్రేలియాను క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఆసీస్‌కు ఇంగ్లాండ్‌లో అద్భుత‌మైన ట్రాక్ రికార్డు ఉన్న‌ప్ప‌టికి ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగే ఓవ‌ల్ మైదానంలో మాత్రం చాలా చెత్త రికార్డు ఉంది. 1880 నుంచి ఈ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియా 38 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. 7 మ్యాచుల్లో మాత్ర‌మే విజ‌యం సాధించింది. ఇక్క‌డ ఆసీస్ విజ‌య‌శాతం 18.42గా ఉంది. ఇంగ్లాండ్‌లో ఉన్న గ్రౌండ్స్‌లో ఆసీస్‌కు ఇదే అత్య‌ల్ప విజ‌య శాతం.

ఓవ‌ల్ మైదానంలో గ‌త 50 సంవ‌త్స‌రాల కాలంలో ఆస్ట్రేలియా రెండంటే రెండు టెస్టుల్లో మాత్ర‌మే గెలిచింది. అయితే.. ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన లార్డ్స్ లో మాత్రం మంచి ట్రాక్ రికార్డు ఆసీస్ సొంతం. ఇక్క‌డ 29 మ్యాచులు ఆడితే 17 మ్యాచుల్లో గెలిచింది. విజ‌య‌శాతం 43.59 శాతంగా ఉంది.

WTC Final 2023: అజింక్యా ర‌హానేను ఊరిస్తున్న రికార్డులు.. ఏంటంటే..?

అటు భార‌త ప‌రిస్థితి కూడా ఏమంత గొప్ప‌గా లేదు ఓవ‌ల్ మైదానంలో భారత్ రెండు విజయాలు సాధించ‌గా ఐదు మ్యాచుల్లో ఓడింది. మ‌రో ఏడు మ్యాచులు డ్రా గా ముగిసాయి. అయితే 2021లో ఇక్కడ ఇంగ్లాండ్ పై 157 పరుగుల తేడాతో విజయం సాధించడం ఒక్క‌టే రోహిత్ శర్మ నేతృత్వంలోని జ‌ట్టులో ఉత్సాహాన్ని నింపుతోంది. గ‌త 40 ఏళ్లలో ఈ వేదికపై టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా సాధించిన తొలి విజ‌యం ఇదే.