WPL-2023 Final, Mumbai vs Delhi: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. తొలి WPL టైటిల్ కైవసం.. ఫైనల్లో ఢిల్లీపై విజయం
మొట్టమొదటి విమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో ఛాంపియన్ గా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది.

WPL-2023 final, Mumbai vs Delhi
WPL-2023 final, Mumbai vs Delhi: మొట్టమొదటి విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో.. ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. టైటిల్ విజేతగా నిలిచింది. ఫైనల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 7 వికెట్ల తేడాతో నెగ్గి.. చాంపియన్ గా నిలిచింది ముంబై. 132 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి మరో 3 బంతులు ఉండగానే ఛేదించింది ముంబై.
LIVE NEWS & UPDATES
-
WPL-2023 విజేత ముంబై ఇండియన్స్
మొట్టమొదటి విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. మూడు బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై గెలిచింది. 132 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై.. 19.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 134 పరుగులతో WPL 2023 టైటిల్ కైవసం చేసుకుంది.
-
రెండో వికెట్ కోల్పోయిన ముంబై
ముంబై జట్టు రెండో వికెట్ కోల్పోయింది. జోనస్సేన్ బౌలింగ్ లో హేలీ మాథ్యూస్ (13) ఔట్ అయింది. ముంబై స్కోరు 4 ఓవర్లకి 24/2గా ఉంది.
-
తొలి వికెట్ కోల్పోయిన ముంబై
ముంబై జట్టు తొలి వికెట్ కోల్పోయింది. రాధా యాదవ్ బౌలింగ్ లో యస్తికా భాటియా (4) ఔట్ అయింది. క్రీజులో హేలీ మాథ్యూస్(8), బ్రంట్ (0) ఉన్నారు.
-
ముంబై ఓపెనర్లుగా హేలీ మాథ్యూస్, యస్తికా భాటియా
ముంబై జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. తొలి ఓవర్లో 9 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ (8), యస్తికా భాటియా (0) క్రీజులో ఉన్నారు.
-
Scalping 3⃣wickets, conceding just 5⃣runs, @mipaltan's @MyNameIs_Hayley put on a stunning show & was the top performer from the first innings of the #TATAWPL #Final. 👏 👏 #DCvMI
A summary of her performance 🔽 pic.twitter.com/xG7dzxqyog
— Women's Premier League (WPL) (@wplt20) March 26, 2023
-
ముంబై ఇండియన్స్ టార్గెట్ 132 పరుగులు
ముంబై బౌలర్ల ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ జట్టులో మెగ్ లాన్నింగ్ 35 పరుగులు, శిఖా పాండే 27 (నాటౌట్), రిచా యాదవ్ 27 (నాటౌట్) మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. చివర్లో శిఖా పాండే, రిచా యాదవ్ మెరుపులు మెరిపించకపోతే ఢిల్లీ స్కోరు 100 కూడా దాటకపోయేది. ముంబై బౌలర్లలో ఇస్సీ వాంగ్, హేలీ మాథ్యూస్ మూడేసి వికెట్లు, అమీలియా 2 వికెట్లు తీశారు.
-
9 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ
ఢిల్లీ క్యాపిటల్స్ 9వ వికెట్ కోల్పోయింది. మణి 1 పరుగుకి, భాటియా డకౌట్ అయ్యారు.
-
స్టేడియానికి సచిన్ టెండూల్కర్
ఫైనల్ మ్యాచ్ చూడడానికి టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వచ్చారు.
The legendary @sachin_rt in the house for the #Final 😃🙌🏻
Follow the match ▶️ https://t.co/N0U4wKUU0z#TATAWPL | #DCvMI pic.twitter.com/s3WcTg6com
— Women's Premier League (WPL) (@wplt20) March 26, 2023
-
ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 14 ఓవర్లకు 77/7
ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 14 ఓవర్లకు 77/7గా ఉంది. క్రీజులో శిఖా పాండే 1, మణి 1 పరుగుతో ఉన్నారు.
-
7 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ
ఢిల్లీ క్యాపిటల్స్ 7వ వికెట్ కోల్పోయింది. అరుంధతి రెడ్డి డకౌట్ అయింది. అంతకు ముందు జోన్నా సేన్ 2 పరుగులకే ఔట్ అయింది.
-
5 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ
ఢిల్లీ క్యాపిటల్స్ 74 పరుగుల వద్ద 5వ వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడిన మెగ్ లాన్నింగ్ 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయింది.
-
4 వికెట్లు డౌన్
ఢిల్లీ క్యాపిటల్స్ 73 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. కాప్ 18 పరుగులు చేసి అమీలియా బౌలింగ్ లో ఔట్ అయింది. స్కోరు 74/4 (11 ఓవర్లకు)గా ఉంది. మెగ్ లాన్నింగ్ 35, జోన్నసెన్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
-
3 వికెట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. రొడ్రిగ్స్ 9 పరుగులు చేసి ఇస్సీ వాంగ్ బౌలింగ్ లో ఔట్ అయింది. దీంతో ముంబై బౌలర్ ఇస్సీ వాంగ్ కు మూడు వికెట్లు దక్కాయి.
-
5 ఓవర్లకు 37 పరుగులు
ఢిల్లీ క్యాపిటల్స్ 5 ఓవర్లకు 37 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మెగ్ లాన్నింగ్ 16, జెమిమా రొడ్రిగ్స్ 9 పరుగులతో ఉన్నారు. ముంబై బౌలర్ ఇస్సీ వాంగ్ కు 2 వికెట్లు దక్కాయి.
-
12 పరుగులకే 2 వికెట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. షఫాలీ వర్మ 11 పరుగులు చేసి, ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఆలిస్ క్యాప్సే వెంటనే డకౌట్ గా వెనుదిరిగింది.
-
తొలి వికెట్
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 12 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. షఫాలీ వర్మ 11 పరుగులు చేసి ఇస్సీ వాంగ్ బౌలింగ్ లో ఔట్ అయింది.
-
బ్యాటింగ్ షురూ..
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. బ్యాటర్లు మెగ్ లాన్నింగ్, షఫాలీ వర్మ క్రీజులోకి వచ్చారు.
-
ముంబై ఇండియన్స్ జట్టు
ముంబై ఇండియన్స్ జట్టు: యస్తికా భాటియా, హేలీ మాథ్యూస్, స్కివర్-బ్రంట్, హర్మన్ ప్రీత్ కౌర్, మెలీ కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలిత, సైకా ఇషాక్
-
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: మెగ్ లాన్నింగ్, షఫాలీ వర్మ, జెమిమా రొడ్రిగ్స్, మారిజానె కాప్, అలిస్ క్యాప్సే, జెస్ జొనాస్సెన్, అరుంధతి రెడ్డి, తానియా భాటియా, రాధా యాదవ్, శిఖా పాండే, మిన్ను మణి
-
మ్యాచ్ కి ముందు
An energetic @mipaltan camp with no shortage of smiles as they get ready to hit the ground running 😃👌 #TATAWPL | #DCvMI pic.twitter.com/f9eq6TlP12
— Women's Premier League (WPL) (@wplt20) March 26, 2023
-
Huddle Time in the Final! 👏
The @DelhiCapitals are ready 💪#TATAWPL | #DCvMI pic.twitter.com/PREO0K7tup
— Women's Premier League (WPL) (@wplt20) March 26, 2023
-
ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్
ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
🚨 Toss Update 🚨@DelhiCapitals win the toss and elect to bat first against @mipaltan. #TATAWPL | #DCvMI | #Final pic.twitter.com/uPm8NOoCCe
— Women's Premier League (WPL) (@wplt20) March 26, 2023