Harmanpreet Kaur: ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ కౌర్
ముంబై ఇండియన్స్ టీమ్‌కు కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ కౌర్ కొనసాగుతుందని ఆ జట్టు యాజమాన్యం బుధవారం ప్రకటించింది. హర్మన్‌ను ముంబై ఇండియన్స్ రూ.1.2 కోట్లకు కొనుగోలు చేసింది. గత వేలంలో అమ్ముడుపోయిన రెండో క్రీడాకారిణి హర్మన్. నిజానికి స్మృతి మంధానను తీసుకునేందుకు ముంబై జట్టు ఆసక్తి చూపింది.

Harmanpreet Kaur: భారత జాతీయ జట్టు కెప్టెన్‌గా కొనసాగుతున్న హర్మన్ ప్రీత్ కౌర్ త్వరలో ముంబై ఇండియన్స్ మహిళా టీమ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ మేరకు ముంబై ఇండియన్స్ తాజాగా దీనిపై ప్రకటన చేసింది. బీసీసీఐ తొలిసారిగా ఈ ఏడాది మహిళా క్రీడాకారిణిలతో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నెల 4 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. మార్చి 26 వరకు ఈ టోర్నీ సాగుతుంది. ఐదు జట్లు ఈ టోర్నీలో పాల్గొనబోతున్నాయి. ఇందులో ముంబై ఇండియన్స్ ఒకటి. ఈ టీమ్‌కు కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ కౌర్ కొనసాగుతుందని జట్టు యాజమాన్యం బుధవారం ప్రకటించింది. హర్మన్‌ను ముంబై ఇండియన్స్ రూ.1.2 కోట్లకు కొనుగోలు చేసింది. గత వేలంలో అమ్ముడుపోయిన రెండో క్రీడాకారిణి హర్మన్. నిజానికి స్మృతి మంధానను తీసుకునేందుకు ముంబై జట్టు ఆసక్తి చూపింది. రూ.3.2 కోట్లు చెల్లించేందుకు ముందుకొచ్చింది. కానీ, బెంగళూరు జట్టు ఆమెను రూ.3.4 కోట్లకు సొంతం చేసుకుంది.
Manish Sisodia: సీబీఐ లాకప్‌లో మనీశ్ సిసోడియాకున్న సదుపాయాలేంటో తెలుసా?
దీంతో ముంబై హర్మన్ ప్రీత్ కౌర్‌ను కొనుగోలు చేసింది. తాజాగా కెప్టెన్‌గా ఎంపిక చేసింది. జట్టును హర్మన్ విజయపథం వైపు నడిపించగలదని, జట్టులో స్ఫూర్తి నింపగలదని భావిస్తున్నట్లు ముంబై ఇండియన్స్ అధినేత్రి నీతా అంబానీ అన్నారు. కెప్టెన్‌గా హర్మన్ భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించింది. ఒత్తిడిలోనూ సమన్వయంతో పని చేయగలదనే పేరుంది ఆమెకు. మరో మూడూ రోజుల్లో ప్రారంభం కానున్న డబ్ల్యూపీఎల్ టోర్నీలో ముంబై తన తొలి మ్యాచ్‌ను గుజరాత్‌తో ఆడబోతుంది.