WPL 2023, RCB vs UPW LiveUpdates In Telugu: బెంగళూరుపై యూపీ గ్రాండ్ విక్టరీ.. దంచికొట్టిన అలెస్సా

యూపీ జట్టు అదరగొట్టింది. బెంగళూరుపై గ్రాండ్ విక్టరీ కొట్టింది. 10 వికెట్ల తేడాతో గెలిచింది. 13 ఓవర్లలోనే టార్గెట్ ను చేజ్ చేసింది. 13ఓవర్లలో యూపీ జట్టు వికెట్ నష్టపోకుండా 139 పరుగులు చేసింది.

WPL 2023, RCB vs UPW LiveUpdates In Telugu: బెంగళూరుపై యూపీ గ్రాండ్ విక్టరీ.. దంచికొట్టిన అలెస్సా

WPL 2023, RCB vs UPW LiveUpdates In Telugu: విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ తలపడ్డాయి. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో యూపీ జట్టు అదరగొట్టింది. బెంగళూరుపై గ్రాండ్ విక్టరీ కొట్టింది. 10 వికెట్ల తేడాతో గెలిచింది. 13 ఓవర్లలోనే టార్గెట్ ను చేజ్ చేసింది. 13ఓవర్లలో యూపీ జట్టు వికెట్ నష్టపోకుండా 139 పరుగులు చేసింది.

యూపీ కెప్టెన్ అలెస్సా హీలే చెలరేగిపోయింది. 47 బంతుల్లో 96 పరుగులతో నాటౌట్ గా ఉంది. ఆమె స్కోర్ లో 18 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. మరో ఓపెనర్ దేవికా వైద్య 31 బంతుల్లో 36 పరుగులతో రాణించింది. యూపీ కెప్టెన్ అలెస్సా సింగిల్ హ్యాండ్ తో జట్టుని గెలిపించింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 19.3 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌట్ అయింది. బెంగళూరు జట్టులో పెర్రీ (52 పరుగులు), సోఫి డివైన్ (36 పరుగులు) మినహా ఎవరూ రాణించలేకపోయారు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 10 Mar 2023 10:21 PM (IST)

    బెంగళూరుని చిత్తు చేసిన యూపీ

    విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ తలపడ్డాయి. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో యూపీ జట్టు అదరగొట్టింది. బెంగళూరుపై గ్రాండ్ విక్టరీ కొట్టింది. 10 వికెట్ల తేడాతో గెలిచింది. 13 ఓవర్లలోనే టార్గెట్ ను చేజ్ చేసింది. 13ఓవర్లలో యూపీ జట్టు వికెట్ నష్టపోకుండా 139 పరుగులు చేసింది.

    యూపీ కెప్టెన్ అలెస్సా హీలే చెలరేగిపోయింది. 47 బంతుల్లో 96 పరుగులతో నాటౌట్ గా ఉంది. ఆమె స్కోర్ లో 18 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. మరో ఓపెనర్ దేవికా వైద్య 31 బంతుల్లో 36 పరుగులతో రాణించింది. యూపీ కెప్టెన్ అలెస్సా సింగిల్ హ్యాండ్ తో జట్టుని గెలిపించింది.

    ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 19.3 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌట్ అయింది. బెంగళూరు జట్టులో పెర్రీ (52 పరుగులు), సోఫి డివైన్ (36 పరుగులు) మినహా ఎవరూ రాణించలేకపోయారు.

  • 10 Mar 2023 09:04 PM (IST)

    యూపీ లక్ష్యం 139 పరుగులు

    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 19.3 ఓవర్లకు ఆలౌట్ అయింది. యూపీ వారియర్స్ ముందు 139 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాటర్లలో పెర్రీ (52 పరుగులు), సోఫి డివైన్ (36 పరుగులు) మినహా ఎవరూ రాణించలేకపోయారు.

  • 10 Mar 2023 08:25 PM (IST)

    100 దాటిన ఆర్సీబీ స్కోరు

    ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. అహుజా 8 పరుగులు చేసి ఔట్ అయిన వెంటనే హీథర్ నైట్ 2 పరుగులు చేసి వెనుదిరిగింది. 35 బంతుల్లో పెర్రీ హాఫ్ సెంచరీ చేసింది. ఆమెతో పాటు క్రీజులో శ్రేయాంక పాటిల్ 14 పరుగులతో ఉంది. జట్టు స్కోరు 114/4 (14.0/20)గా ఉంది.

  • 10 Mar 2023 08:20 PM (IST)

    మూడు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ

    ఆర్సీబీ మూడు వికెట్లు కోల్పోయింది. అహుజా 8 పరుగులు చేసి ఔట్ అయింది. ప్రస్తుతం క్రీజులో పెర్రీ 48, హీథర్ నైట్ ఒక్క పరుగుతో క్రీజులో ఉంది. స్కోరు 98/3 (12.1/20)గా ఉంది.

  • 10 Mar 2023 08:03 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ

    ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. సోఫి 36 పరుగులు చేసి ఔట్ అయింది. ప్రస్తుతం క్రీజులో పెర్రీ 33 పరుగులతో ఉంది. స్కోరు 73/2 (8.2/20)గా ఉంది.

  • 10 Mar 2023 07:47 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ

    ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. స్మృతి మంధాన 4 పరుగులు చేసి రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్ లో అంజలికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్తుతం క్రీజులో సోఫియా 25, పెర్రీ 5 పరుగులతో ఉన్నారు.

  • 10 Mar 2023 07:18 PM (IST)

    ఆర్సీబీ జట్టు

    RCB

    RCB

  • 10 Mar 2023 07:17 PM (IST)

    యూపీ వారియర్స్ టీమ్

    UPW

    UPW

  • 10 Mar 2023 07:12 PM (IST)

    ఆర్సీబీ బ్యాటింగ్

    టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.