WPL 2023 RCB vs UPW : బెంగళూరుకి ఏమైంది? వరుసగా నాలుగో ఓటమి.. యూపీ చేతిలో చిత్తు

విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, యూపీ యూపీ జట్టు అదరగొట్టింది. బెంగళూరుపై గ్రాండ్ విక్టరీ కొట్టింది. 10 వికెట్ల తేడాతో గెలిచింది. 13 ఓవర్లలోనే టార్గెట్ ను చేజ్ చేసింది. 13ఓవర్లలో యూపీ జట్టు వికెట్ నష్టపోకుండా 139 పరుగులు చేసింది.

WPL 2023 RCB vs UPW : బెంగళూరుకి ఏమైంది? వరుసగా నాలుగో ఓటమి.. యూపీ చేతిలో చిత్తు

WPL 2023 RCB vs UPW : విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ తలపడ్డాయి. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో యూపీ జట్టు అదరగొట్టింది. బెంగళూరుపై గ్రాండ్ విక్టరీ కొట్టింది. 10 వికెట్ల తేడాతో గెలిచింది. 13 ఓవర్లలోనే టార్గెట్ ను చేజ్ చేసింది. 13ఓవర్లలో యూపీ జట్టు వికెట్ నష్టపోకుండా 139 పరుగులు చేసింది.

Also Read..Jason Roy In PSL: వామ్మో ఇదేం బాదుడు.. 20 ఫోర్లు, 5 సిక్సర్లు.. దెబ్బకు రికార్డు బద్దలు

ముఖ్యంగా యూపీ ఓపెనర్, ఆ జట్టు కెప్టెన్ అలెస్సా హీలే చెలరేగిపోయింది. బౌండరీల వర్షం కురిపించింది. 47 బంతుల్లోనే 96 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. ఆమె స్కోర్ లో 18 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. మరో ఓపెనర్ దేవికా వైద్య 31 బంతుల్లో 36 పరుగులతో రాణించింది. యూపీ కెప్టెన్ అలెస్సా సింగిల్ హ్యాండ్ తో జట్టుని గెలిపించింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 19.3 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌట్ అయింది. బెంగళూరు జట్టులో పెర్రీ (52 పరుగులు), సోఫి డివైన్ (36 పరుగులు) మినహా ఎవరూ రాణించలేకపోయారు.

Also Read..IND vs AUS Test 2023: తెలుగు కుర్రాడు భరత్‌కు రాహుల్ మద్దతు.. నాల్గో టెస్టులో చోటు పదిలమేనా..

కాగా, బెంగళూరు తీరు మారలేదు. మరో ఓటమి తప్పలేదు. బెంగళూరుకి ఇది వరుసగా నాలుగో పరాజయం. డబ్ల్యూపీఎల్ లో అత్యధిక ధర పొందిన క్రికెటర్ స్మృతి మందన కెప్టెన్ గా ఉన్న జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. సోఫీ డివైన్, ఎలిస్ పెర్రీ, హీదర్ నైట్, రిచా ఘోష్ వంటి ప్రపంచస్థాయి క్రికెటర్లు ఉన్న జట్టు అది. కానీ, ఇప్పటివరకు టోర్నీలో గెలుపు రుచి చూడకపోవడం ఆర్సీబీ ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేస్తోంది.

ఇవాళ యూపీ వారియర్స్ తో మ్యాచ్ లోనూ బెంగళూరు అమ్మాయిలు ఓడిపోయారు. అన్ని రంగాల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఆధిపత్యం కనబర్చిన యూపీ వారియర్స్ 10 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. వరుసగా నాలుగు ఓటములతో.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది ఆర్సీబీ.