WPL 2023 UPW vs DC : ఫైనల్‌కి చేరిన ఢిల్లీ.. యూపీపై విజయం

ఢిల్లీ అమ్మాయిలు అదరగొట్టారు. యూపీని చిత్తు చేశారు. అంతేకాదు.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)2023 టోర్నీలో ఫైనల్ కి చేరారు.

WPL 2023 UPW vs DC : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)2023లో భాగంగా మంగళవారం ఢిల్లీ కేపిటల్స్, యూపీ వారియర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఢిల్లీ అమ్మాయిలు అదరగొట్టారు. యూపీని చిత్తు చేశారు. అంతేకాదు.. ఈ టోర్నీలో ఫైనల్ కి చేరారు.

భారత్ లో ఈ ఏడాది తొలిసారిగా నిర్వహిస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. చివరి లీగ్ మ్యాచ్ లో యూపీ వారియర్స్ పై ఢిల్లీ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి నేరుగా ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది.(WPL 2023 UPW vs DC)

Also Read..ICC WTC, 2021-23: ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో టాప్-5 బ్యాట్స్‌మెన్ వీరే.. ఐదుగురూ డబుల్ సెంచరీ.

ఈ మ్యాచ్ లో యూపీ వారియర్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. తహ్లియా మెక్ గ్రాత్ 58 పరుగులతో అజేయంగా నిలిచింది. కెప్టెన్ అలీసా హీలీ 36, శ్వేతా సెహ్రావత్ 19 పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అలైస్ కాప్సే 3 వికెట్లు పడగొట్టింది. రాధా యాదవ్ 2 వికెట్లు, జొనాసెన్ 1 వికెట్ తీశారు.

139 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. 17.5 ఓవర్లలోనే టార్గెట్ ను ఫినిష్ చేసింది. 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది విక్టరీ కొట్టింది. ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ 39, అలైస్ కాప్సే 34, మరిజేన్ కాప్ 34 (నాటౌట్), షెఫాలీ వర్మ 21 పరుగులతో జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశారు.

Also Read..Steve Smith: అద్భుతంగా క్యాచ్ పట్టిన స్మిత్.. ‘క్యాచ్ ఆఫ్ ద సెంచరీ’ అంటున్న జహీర్ ఖాన్… వీడియో ఇదిగో!

ఈ టోర్నీలో మొత్తం ఐదు జట్లు పోటీపడుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచుల్లో 6 విజయాలు, 2 ఓటములతో మొత్తం 12 పాయింట్లు సాధించి టేబుల్ లో నెంబర్ వన్ గా ఉంది. రెండో స్థానంలో ముంబై ఇండియన్స్ ఉంది. ఆ జట్టు 8 మ్యాచుల్లో 6 విజయాలు సాధించినా, రన్ రేట్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ పొజిషన్ లో నిలిచింది.

ఇక, మార్చి 24న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై, యూపీ వారియర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్ మార్చి 26న ముంబై బ్రాబౌర్న్ స్టేడియంలో జరగనుంది.

Also Read..Asia Cup-2023: ఇది యుద్ధాలు చేసుకునే తరం కాదు.. పాక్ కు టీమిండియా రావాలి: షాహిద్ అఫ్రిదీ

ట్రెండింగ్ వార్తలు