WPL 2023, UPW vs MI LiveUpdates In Telugu: యూపీపై ముంబై ఘన విజయం

ముంబై జట్టు అదరగొట్టింది. యూపీ వారియర్స్ పై ఘన విజయం సాధించింది. 160 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై.. 17.3 ఓవర్లలోనే టార్గెట్ ను చేజ్ చేసింది. రెండు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.

WPL 2023, UPW vs MI LiveUpdates In Telugu: యూపీపై ముంబై ఘన విజయం

WPL 2023, UPW vs MI LiveUpdates In Telugu

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో(WPL) భాగంగా ఆదివారం యూపీ వారియర్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ముంబై జట్టు అదరగొట్టింది. యూపీ వారియర్స్ పై ఘన విజయం సాధించింది. 160 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై.. 17.3 ఓవర్లలోనే టార్గెట్ ను చేజ్ చేసింది. రెండు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన యూపీ వారియర్స్ మొదట బ్యాటింగ్ చేసి, ముంబై ఇండియన్స్ ముందు 160 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. యూపీ వారియర్స్ జట్టు..20ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.

 

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 12 Mar 2023 11:08 PM (IST)

    చెలరేగిన కౌర్.. ముంబైకి వరుసగా 4వ విజయం

    ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో(WPL) భాగంగా ఆదివారం యూపీ వారియర్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ముంబై జట్టు అదరగొట్టింది. యూపీ వారియర్స్ పై ఘన విజయం సాధించింది. 160 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై.. 17.3 ఓవర్లలోనే టార్గెట్ ను చేజ్ చేసింది. రెండు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.

  • 12 Mar 2023 09:10 PM (IST)

    ముంబై ఇండియన్స్ లక్ష్యం 160

    ముంబై ఇండియన్స్ ముందు యూపీ వారియర్స్ 160 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. యూపీ వారియర్స్ బ్యాటర్లు అలీస్సా హీలీ 58, మెక్ గ్రాత్ 50 పరుగులతో రాణించడంతో యూపీ వారియర్స్ స్కోరు 20 ఓవర్లకు 159/6గా నమోదైంది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో సైకా 3 వికెట్లు, అమీలియా 2 వికెట్లు తీశారు.

  • 12 Mar 2023 08:48 PM (IST)

    మెక్ గ్రాత్ హాఫ్ సెంచరీ.. ఔట్

    యూపీ వారియర్స్ బ్యాటర్ మెక్ గ్రాత్ హాఫ్ సెంచరీ చేసింది. అనంతరం,  అలీస్సా హీలీ (58 పరుగులు) ఔట్ అయింది. ఆ వెంటనే మెక్ గ్రాత్ (50) కూడా వెనుదిరిగింది. యూపీ వారియర్స్ స్కోరు 140/4 (16.5/20)గా ఉంది.

  • 12 Mar 2023 08:38 PM (IST)

    అలీస్సా హీలీ హాఫ్ సెంచరీ

    యూపీ వారియర్స్ బ్యాటర్ అలీస్సా హీలీ హాఫ్ సెంచరీ చేసింది. మెక్ గ్రాత్ కూడా హాఫ్ సెంచరీ దిశగా వెళ్తుంది. ప్రస్తుతం క్రీజులో అలీస్సా హీలీ 52, మెక్ గ్రాత్ 39 పరుగులతో ఉన్నారు. యూపీ వారియర్స్ స్కోరు 123/2 (14 ఓవర్లకు)గా ఉంది.

  • 12 Mar 2023 08:34 PM (IST)

    13 ఓవర్లలో 113 పరుగులు

    యూపీ వారియర్స్13 ఓవర్లలో 113 పరుగులు చేసింది. 2 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో అలీస్సా హీలీ 44, మెక్ గ్రాత్ 38 పరుగుతో ఉన్నారు.

  • 12 Mar 2023 07:45 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన యూపీ వారియర్స్

    యూపీ వారియర్స్ తొలి వికెట్ కోల్పోయింది. దేవికా వైద్య 6 పరుగులకే సైకా బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. ప్రస్తుతం క్రీజులో అలీస్సా హీలీ 2, కిరణ్ నవ్గిరె 4 పరుగులతో ఉన్నారు. స్కోరు 15/1 (3 ఓవర్లకు)గా ఉంది.

  • 12 Mar 2023 07:18 PM (IST)

    యూపీ జట్టు ఇదే

  • 12 Mar 2023 07:16 PM (IST)

    ముంబై జట్టు ఇదే