Smriti Mandhana : వావ్ నిజంగా అద్భుతం.. ఇదో సరికొత్త చరిత్ర.. స్మృతి మంధాన సంతోషం

Smriti Mandhana: విమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో తనకు అత్యధిక ధర పలకడం పట్ల స్మృతి మంధాన సంతోషం వ్యక్తం చేసింది. మహిళ క్రికెట్ లో ఇది సరికొత్త చరిత్ర అంటూ పొంగిపోయింది.

Smriti Mandhana : వావ్ నిజంగా అద్భుతం.. ఇదో సరికొత్త చరిత్ర.. స్మృతి మంధాన సంతోషం

Smriti-Mandhana-WPL-Auction

Smriti Mandhana: విమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో భారత అమ్మాయిలపై కాసుల వర్షం కురిసింది. టీమిండియా మహిళా క్రికెటర్లపై ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి. టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధానను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అత్యధికంగా రూ. 3.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఆమెకు బేస్ ప్రైస్(రూ.50) కంటే దాదాపు 7 రెట్లు ఎక్కువ ధర దక్కడం విశేషం. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కనీస ధర రూ.50 లక్షలు కాగా, ఆమెను ముంబై ఇండియన్స్ కోటి 80 లక్షల రూపాయలకు సొంతం చేసుకుంది.

విమెన్ ప్రీమియర్ లీగ్ వేలంలో తనకు అత్యధిక ధర పలకడం పట్ల స్మృతి మంధాన సంతోషం వ్యక్తం చేసింది. మహిళ క్రికెట్ లో ఇది సరికొత్త చరిత్ర అంటూ పొంగిపోయింది. మహిళా క్రికెటర్లు మంచి రోజులు వచ్చాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

Smriti-Mandhana-WPL-Auction

Smriti-Mandhana-WPL-Auction

స్పోర్ట్స్ 18తో మాట్లాడుతూ… ‘గత పదేళ్లుగా మేము పురుషుల క్రికెట్ వేలం పాటలను చూస్తున్నా. మహిళా క్రికెటర్ల కోసం కూడా వేలం పాట నిర్వహించడం అద్భుతం. ఎందుకంటే పురుషుల క్రికెట్ వేలం పాటలు ఎల్లప్పుడూ జరిగినా కళ్లప్పగించి చూసేదాన్ని. మహిళల క్రికెటర్లకూ కూడా ఈ విధమైన వేలం నిర్వహించడం పెద్ద ముందడుగు. మొట్టమొదట సారిగా విమెన్ ప్రీమియర్ లీగ్ నిర్వహణ, వేలం సరికొత్త చరిత్ర అని” స్మృతి మంధాన పేర్కొంది.

Also Read: విమెన్ ప్రీమియర్ లీగ్ వేలం అప్డేట్స్.. అత్యధిక, స్వల్ప ధరలు పలికిన క్రికెటర్లు ఎవరంటే…

భారత అమ్మాయిల హవా..
స్మృతి మంధాన తర్వాత దీప్తి శర్మను రూ. 2.6 కోట్లకు యూపీ వారియర్స్ దక్కించుకుంది. జెమిమా రోడ్రిగ్స్ రూ. 2.2 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్), షెఫాలీ వర్మీ రూ. 2 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్), పూజా వస్త్రాకర్ రూ. 1.9 కోట్లు (ముంబై ఇండియన్స్), రిచా ఘోష్ రూ. 1.9 కోట్లు (ఆర్సీబీ), హర్మన్ ప్రీత్ కౌర్ రూ.1.8 కోట్లు (ముంబై ఇండియన్స్), రేణుకా సింగ్ రూ. 1.5 కోట్లు (ఆర్సీబీ) కూడా మంచి ధర దక్కించుకున్నారు.