WPL2023 Eliminator MIvsUPW : దంచికొట్టిన సీవర్.. యూపీ ముందు భారీ లక్ష్యం
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు స్కోర్ చేసింది. యూపీ జట్టుకి 183 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించింది.

WPL2023 Eliminator MIvsUPW : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో భాగంగా కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు స్కోర్ చేసింది. యూపీ జట్టుకి 183 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించింది.
ముంబై జట్టులో నాట్ సీవర్ హాఫ్ సెంచరీతో చెలరేగింది. 38 బంతుల్లోనే 72 పరుగులు బాది నాటౌట్ గా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. యస్తికా భాటియా (21), హేలీ మాథ్యూస్ (26), అమేలియా కేర్ (29) ఫర్వాలేదనిపించారు. యూపీ బౌలర్లలో సోఫీ 2 వికెట్లు తీయగా.. గ్రేస్ హారీస్, చోప్రా తలో వికెట్ పడగొట్టారు.
Also Read..Asia Cup 2023: పంతం నెగ్గించుకున్న భారత్..! ఆసియాకప్ టోర్నీలో భారత్ మ్యాచ్‌లు యూఏఈలో..?
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ చేరింది. ఢిల్లీతో కప్ కోసం తలపడే జట్టు నేడు తేలిపోతుంది. ఎలిమినేటర్‌లో బలమైన ముంబై ఇండియన్స్‌తో యూపీ వారియర్స్ అమీతుమీ తేల్చుకుంటోంది. బలాబలాలు లెక్కలు వేసుకుంటే హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని ముంబై.. ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది.
అదే సమయంలో స్ఫూర్తిదాయక ఆటతో సత్తా చాటుతున్న వారియర్స్‌ని తక్కువ అంచనా వేయలేము అంటున్నారు స్పోర్ట్స్ అనలిస్టులు. యూపీతో గత మ్యాచ్‌లో ముంబై ఓడిపోయిందని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యూపీపై నెగ్గి ప్రతీకారం తీర్చుకోవాలని ముంబయి పట్టుదలగా ఉంది. హర్మన్‌ప్రీత్ స్థిరంగా రాణిస్తుండడం ముంబయికి సానుకూలాంశం. నాట్ సీవర్, యస్తిక భాటియా కీ ప్లేయర్లు.
ఇక యూపీ విషయానికి వస్తే.. కెప్టెన్ అలీసా హీలీ, తాలియా మెక్‌గ్రాత్‌లనే నమ్ముకుంది. సమష్టిగా రాణిస్తున్న యూపీ.. అంచనాల మేరకు ఆడితే ముంబయికి ఇంకోసారి ఝలక్ ఇవ్వగలదు.