WTC Final 2021: ఫైనల్‌లో కివీస్ గెలుపు.. ఐదుగురు హీరోలు వీళ్లే!

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను న్యూజిలాండ్ తొలిసారిగా కైవసం చేసుకుంది. టెస్ట్ ఛాంపియన్‌గా నిలిచిన కివీస్‌‌ను ఈ స్థాయిలో నిలబెట్టడంలో ఆ టీమ్ సమిష్టి కృషి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

WTC Final 2021: ఫైనల్‌లో కివీస్ గెలుపు.. ఐదుగురు హీరోలు వీళ్లే!

Wtc Final 2021 Devon Conway And Kane Williamsons Excellent Batting And Kyles Bowling

WTC Final 2021: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను న్యూజిలాండ్ తొలిసారిగా కైవసం చేసుకుంది. టెస్ట్ ఛాంపియన్‌గా నిలిచిన కివీస్‌‌ను ఈ స్థాయిలో నిలబెట్టడంలో ఆ టీమ్ సమిష్టి కృషి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆల్‌రౌండ్ ప్రతిభతో అధ్భుతంగా రాణించి టెస్ట్ ఛాంపియన్‌లుగా నిలిచారు. అయితే, ఫైనల్‌లో 8 వికెట్ల విజయంలో ముఖ్యమైన పాత్ర నలుగురిది. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవల్సిందే.

న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో భారత జట్టు బ్యాటింగ్ పూర్తిస్థాయిలో విఫలం అవగా.. తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకు మాత్రమే చేశారు. ఈ గొప్ప మ్యాచ్‌లో, అవమానకరంగా భారత జట్టు 139పరుగుల లక్ష్యాన్ని కివీస్‌కు మాత్రమే నిర్దేశించింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్, డేవాన్ కాన్వే, మరో ఇద్దరు బౌలర్లు టిమ్ సౌథీ, కైల్ జెమీసన్ కివీస్‌ను విశ్వ విజేతలుగా నిలబెట్టారు.

కైల్ జెమీసన్ పదునైన బౌలింగ్:
ఈ మ్యాచ్‌లో, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కైల్ జెమీసన్ పదునైన బౌలింగ్‌తో భారత ఓటమిలో ముఖ్యమైన పాత్ర పోషించారు. తొలి ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లలో 31 పరుగులకు 5 వికెట్లు తీసి భారత్‌ను పరుగులు తీయకుండా కట్టడిచేశారు. రెండవ ఇన్నింగ్స్‌లోనూ కీలకమైన రెండు వికెట్లను తీశాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, టెస్ట్ స్పెషలిస్ట్ పుజారాల కీలక వికెట్లను తీశాడు కైల్ జెమీసన్.

టిమ్ సౌతీ అనుభవం:
తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్క వికెట్ తీసిన టిమ్ సౌతీ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఘనమైన ఆరంభం ఇచ్చిన ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్మాన్ గిల్ ఇద్దరి వికెట్లను సౌతీ తీశాడు.

కెప్టెన్ విలియమ్సన్:
తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కెప్టెన్ కేన్ విలియమ్సన్ 49 పరుగులు చేశాడు. రెండవ ఇన్నింగ్స్‌లో, లక్ష్యాన్ని సాధించేటప్పుడు రెండు వికెట్లూ మొదట్లోనే పడిపోగా.. బలమైన ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 177 బంతుల్లో 49 పరుగులు చేసిన విలియమ్సన్.. రెండో ఇన్నింగ్స్‌లో 89 బంతుల్లో అజేయంగా 52 పరుగులు చేశాడు.

కాన్వే, బౌల్ట్ కూడా కీలకంగా:
ఇక డేవాన్ కాన్వే కూడా తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్‌సెంచరీతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 153బంతుల్లో 54పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 19పరుగులకే అవుట్ అయ్యాడు. ఇక బౌల్ట్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు.. మొత్తం ఐదు వికెట్లు తీసి మ్యాచ్‌ విజయంలో కీలకం అయ్యాడు.