WTC Final 2023: తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 469 ఆలౌట్‌

లండ‌న్‌లోని ఓవ‌ల్ వేదిక‌గా టీమ్ఇండియా(Team India)తో జ‌రుగుతున్న ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్‌(WTC Final 2023) మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా(Australia) 469 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

WTC Final 2023: తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 469 ఆలౌట్‌

team india (pic@bcci twitter)

WTC Final: లండ‌న్‌లోని ఓవ‌ల్ వేదిక‌గా టీమ్ఇండియా(Team India)తో జ‌రుగుతున్న ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్‌(WTC Final 2023) మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా(Australia) 469 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఓవ‌ర్ నైట్ స్కోరు 327/3తో రెండో రోజు ఆట‌ను కొన‌సాగించిన ఆసీస్ మ‌రో 142 ప‌రుగులు జోడించి మిగిలిన ఏడు వికెట్ల‌ను కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాట‌ర్ల‌లో ట్రావిస్ హెడ్‌ (163; 174 బంతుల్లో 25 ఫోర్లు, 1 సిక్స్‌) స్టీవ్ స్మిత్‌(121; 268 బంతుల్లో 19 ఫోర్లు) శ‌త‌కాల‌తో చెల‌రేగారు. అలెక్స్ కేరీ (48; 69 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) , డేవిడ్ వార్న‌ర్ (43; 60బంతుల్లో 8 ఫోర్లు) రాణించారు. భార‌త బౌలర‌ల్లో సిరాజ్ నాలుగు వికెట్లు తీయ‌గా, ష‌మీ, శార్దూల్ చెరో రెండు వికెట్లు, జ‌డేజా ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

Steve Smith: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌లో స్టీవ్ స్మిత్ సెంచ‌రీ.. ప‌లు రికార్డులు బ్రేక్‌

స్టీవ్ స్మిత్ శ‌త‌కం

రెండో రోజు మ్యాచ్ ప్రారంభ‌మైన మొద‌టి ఓవ‌ర్‌లోనే సిరాజ్ బౌలింగ్‌లో వ‌రుస‌గా రెండు ఫోర్లు కొట్టిన స్మిత్ శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో ఇది అత‌డికి 31వ సెంచ‌రీ. మ‌రికాసేప‌టికే ష‌మీ బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన హెడ్ 150 ప‌రుగుల మార్క్‌ను అందుకున్నాడు. ప్ర‌మాద‌క‌రంగా మారిన ఈ జోడిని హెడ్‌ను ఔట్ చేయ‌డం ద్వారా సిరాజ్ విడ‌గొట్టాడు. ట్రావిస్ హెడ్‌, స్మిత్ జోడి నాలుగో వికెట్ 285 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు.

హెడ్ ఔటైన త‌రువా క్రీజులోకి వ‌చ్చిన గ్రీన్‌(6)ను ష‌మీ ఎక్కువ సేపు క్రీజులో నిల‌వ‌నీయ‌లేదు. శుభ్‌మ‌న్ గిల్ క్యాచ్ అందుకోవ‌డంతో అత‌డు ఔట్ అయ్యాడు. స్మిత్‌ను శార్దూల్ క్లీన్ బౌల్డ్ చేయ‌గా, మిచెల్ స్టార్క్‌ను అక్ష‌ర్ ప‌టేల్ ర‌నౌట్ చేయ‌డంతో లంచ్ బ్రేక్ కు ఆసీస్ 422/7తో వెళ్లింది. లంచ్ త‌రువాత అలెక్స్ కేరీ వేగంగా బ్యాటింగ్ చేశాడు. జ‌డేజా అత‌డి ఇన్నింగ్స్‌ను తెర‌దించాడు. ఆ త‌రువాత ఆసీస్ ఇన్నింగ్స్ ముగియ‌డానికి ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌లేదు.

WTC Final 2023: తుది జట్టులోకి అశ్విన్‌ను తీసుకోకపోవటానికి కారణమేంటో తెలుసా? కెప్టెన్ రోహిత్ ఏం చెప్పారంటే..