WTC Final 2023: ముగిసిన రెండో ఆట.. టీమ్ఇండియా స్కోరు 151/5
లండన్‌లోని ఓవల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.

wtc final day 2
WTC Final 2023-Ind vs Aus:లండన్‌లోని ఓవల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ ఇండియా స్కోరు 151/5.
LIVE NEWS & UPDATES
-
ముగిసిన రెండో ఆట
లండన్‌లోని ఓవల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ ఇండియా స్కోరు 151/5. క్రీజులో అజింక్యా రహానే(Ajinkya Rahane) 29, శ్రీకర్ భరత్(Srikar Bharat) 5 పరుగులతో ఉన్నారు.
-
జడేజా ఔట్
అర్ధశతకానికి రెండు పరుగుల దూరంలో జడేజా(48) ఔట్ అయ్యాడు. నాథన్ లయోన్ బౌలింగ్‌లో స్లిప్‌లో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి జడేజా పెవిలియన్‌కుచేరుకున్నాడు.
-
విరాట్ కోహ్లీ ఔట్
మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లి(14) స్లిప్‌లో స్టీవ్ స్మిత్‌కు దొరికాడు. దీంతో భారత్ 71 పరుగుల(18.2వ ఓవర్) వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.
-
పుజారా క్లీన్ బౌల్డ్
టీమ్ఇండియాకు పెద్ద షాక్ తగిలింది. కౌంటీ సీజన్‌లో పరుగుల వరద పారించిన పుజారా(14) ఔట్ అయ్యాడు. కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో(13.5వ ఓవర్) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 50 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది.
-
విఫలమైన భారత ఓపెనర్లు
మొదటి రోజు విఫలమైన బౌలర్లు రెండో రోజు పుంజుకుని ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌట్ చేశారు. అయితే.. ఆసీస్ ఇన్నింగ్స్‌ను ముగించామన్న ఆనందం కాసేపైన భారత అభిమాలనుకు లేకుండా పోయింది. తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ఇద్దరు విఫలం అయ్యారు. రోహిత్ శర్మ (15)ను కమిన్స్ ఎల్భీగా ఔట్ చేయగా, శుభ్‌మన్ గిల్(13)ను బొలాండ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో భారత్ 30 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
-
ఆస్ట్రేలియా ఆలౌట్
ఓవల్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 469 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఆటగాళ్లలో ట్రావిస్ హెడ్ (163), స్టీవ్ స్మిత్ (121) శతకాలతో సత్తా చాటగా డేవిడ్ వార్నర్(43), అలెక్స్ కేరీ(48) రాణించారు. భారత బౌలరల్లో సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా, షమీ, శార్దూల్ చెరో రెండు వికెట్లు, జడేజా ఓ వికెట్ పడగొట్టాడు.
-
లంచ్ బ్రేక్
రెండో రోజు భారత బౌలర్లు పుంజుకున్నారు. 327/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు మొదటి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆస్ట్రేలియా రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 7 వికెట్లు కోల్పోయి 422 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో అలెక్స్ క్యారీ(22), కమిన్స్(2)లు ఉన్నారు. ఈ సెషన్‌లో 95 పరుగులు రాగా.. నాలుగు వికెట్లు పడ్డాయి.
-
మిచెల్ స్టార్క్ రనౌట్
అక్షర్ పటేల్ విసిరిన అద్భుతమైన త్రోకు మిచెల్ స్టార్క్(5) రనౌట్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 402 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది.
-
స్టీవ్ స్మిత్ ఔట్
ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. ఎట్టకేలకు స్టీవ్ స్మిత్(121) ఔట్ అయ్యాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో స్మిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 387 పరుగుల (98.1వ ఓవర్) వద్ద ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది.
-
కామెరూన్ గ్రీన్ ఔట్
ఉదయం పూట పిచ్ పై ఉండే తేమను సద్వినియోగం చేసుకుంటున్నారు భారత బౌలర్లు. హెడ్ ఔటైన తరువాత క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్(6)ను క్రీజులో ఎక్కువ సేపు కుదురుకోనివ్వలేదు. మహ్మద్ షమీ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ క్యాచ్ అందుకోవడంతో గ్రీన్ ఔట్ అయ్యాడు. దీంతో ఆసీస్ 376 పరుగుల(94.2వ ఓవర్) వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.
-
ట్రావిస్ హెడ్ ఔట్
ఎట్టకేలకు టీమ్ఇండియా బౌలర్లు మరో వికెట్ పడగొట్టారు. నిన్నటి నుంచి కొరకరాని కొయ్యగా మారి పరుగుల వరద పారిస్తున్న ట్రావిస్ హెడ్(163) ఔట్ అయ్యాడు. మహ్మద్ సిరాజ్ బౌలింగ్ లో కీపర్ శ్రీకర్ భరత్ చేతికి చిక్కాడు. దీంతో 361 పరుగుల వద్ద ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. ట్రావిస్ హెడ్, స్మిత్ జోడి నాలుగో వికెట్ 285 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
-
ట్రావిస్ హెడ్ 150
తొలి రోజు ఆడినట్లే రెండో రోజు కూడా ఆసీస్ బ్యాటర్లు ఎదురుదాడికి దిగుతున్నారు. మహ్మద్ షమీ బౌలింగ్‌లో(88.2వ ఓవర్) ఫోర్ కొట్టి ట్రావిస్ హెడ్ 164 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందులో 23 ఫోర్లు, ఓ సిక్స్ ఉంది.
-
స్టీవ్ స్మిత్ సెంచరీ
మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా మూడు వికెట్లు నష్టపోయి 327 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (146; 156 బంతుల్లో 22 ఫోర్లు, ఒక సిక్స్), స్టీవ్ స్మిత్ (95; 227 బంతుల్లో 14 ఫోర్లు)తో క్రీజులో ఉన్నారు. రెండో రోజు ఆట ప్రారంభమైంది. తొలి ఓవర్‌ను సిరాజ్ వేశాడు. వరుసగా రెండు ఫోర్లు కొట్టిన స్మిత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై అతడికి ఇది ఏడో సెంచరీ. కాగా.. ఓవరాల్‌గా టెస్టుల్లో 31వ శతకం