WTC Final: మొదలవకుండానే ముగిసింది.. వానదే మొదటిరోజు!

ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా మొదలుకావాల్సిన మ్యాచ్ వర్షార్పణం అయింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా భారీ అంచనాలతో సిద్ధమైన ఇరు జట్లతో పాటు యావత్ ప్రపంచానికే నిరుత్సాహం మిగిల్చింది. కనీసం టాస్‌ కుడా పడకుండానే భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరగాల్సిన ఆట రద్దు....

WTC Final: మొదలవకుండానే ముగిసింది.. వానదే మొదటిరోజు!

First Day

WTC Final: ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా మొదలుకావాల్సిన మ్యాచ్ వర్షార్పణం అయింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా భారీ అంచనాలతో సిద్ధమైన ఇరు జట్లతో పాటు యావత్ ప్రపంచానికే నిరుత్సాహం మిగిల్చింది. కనీసం టాస్‌ కుడా పడకుండానే భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరగాల్సిన ఆట రద్దు అయినట్లు ప్రకటించారు.

ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తోన్న వర్షంతో టీ విరామం తర్వాత రిఫరీ ఫస్ట్ డే ఆట క్యాన్సిల్ చేస్తున్నట్లుగా ప్రకటించాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వరుణుడు కాస్త కరుణించినట్లు కనిపించినా, ఆతర్వాత మళ్లీ పడిసిన వర్షంతో ఆట ఆపేయాల్సి వచ్చింది.

మైదానమంతా వర్షంతో తడిచి నీరు నిలిచిపోయింది. శుక్రవారం తొలి ఆట ఇలా ఆగిపోవడంతో రెండో రోజు ఆట శనివారం మొదలవుతుందా అనే సందేహాలు కూడా మొదలయ్యాయి.

ఇదిలా ఉంటే… మ్యాచ్ జరగాల్సిన సౌథాంప్టన్‌ ప్రాంతంలో రానున్న ఆరు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని బ్రిటన్ మెటరోలాజికల్ డిపార్ట్‌మెంట్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఎల్లో వెదర్ వార్నింగ్‌ ఇచ్చారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా.