WTC Final: కోహ్లీకి పాట డెడికేట్ చేసిన ఇండియన్ ఆర్మీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కోసం ఇండియన్ ఆర్మీ ఓ పాటను డెడికేట్ చేసింది. వరల్డ్ ఛాంపియన్ టెస్ట్ భాగంగా జరుగుతోన్న మూడో రోజు ఆటలో సౌతాంప్టన్ వేదికగా ఆదివారం పాట వినిపించింది.

WTC Final: కోహ్లీకి పాట డెడికేట్ చేసిన ఇండియన్ ఆర్మీ

Indian Army

WTC Final: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కోసం ఇండియన్ ఆర్మీ ఓ పాటను డెడికేట్ చేసింది. వరల్డ్ ఛాంపియన్ టెస్ట్ భాగంగా జరుగుతోన్న మూడో రోజు ఆటలో సౌతాంప్టన్ వేదికగా ఆదివారం పాట వినిపించింది.

ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 217 పరుగులకు ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కైల్ జామిసన్ 5 వికెట్లు పడగొట్టి భారత ఆటగాళ్లను త్వరగా పెవిలియన్ పంపడంలో సాయపడ్డాడు.

రోహిత్ శర్మ, షుబ్మాన్ గిల్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు మంచి ఆరంభం ఇచ్చి, మొదటి వికెట్‌కు 62 పరుగులు జోడించారు, కాని కైల్ జామిసన్ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశారు. తర్వాత కోహ్లీ, రహానే నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ కాపాడారు.

ఓవర్ నైట్ స్కోరు 146/3తో మూడో రోజు తొలి ఇన్సింగ్స్ ప్రారంభించిన భారత జట్టు స్వల్ప వ్యధిలోని నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. 149 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ (44), 156 పరుగుల వద్ద రిషభ్ పంత్ (4) అవుట్ అవ్వగా.., అజింక్య రహానే 49 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. జడేజాతో కలిసి జాగ్రత్తగా ఆడుతున్నట్టు కనిపించిన అశ్విన్ అవుటడంతో భారత జట్టు తక్కువ స్కోరు చేస్తుందని ఫిక్స్ అయ్యారు.

మ్యాచ్ కు ముందు కామెంటరీ ప్యానెల్ లో ఉన్న దినేశ్ కార్తీక్ మైదానం గురించి సోషల్ మీడియా పోస్టు పెట్టాడు. మ్యాచ్ ఆరంభమయ్యే సమయానికి మేఘావృతమై ఉన్నా వర్షం పడే అవకాశం లేదని పేర్కొన్నాడు.