WTC final: ఇండియాపై ఇన్నింగ్స్ సమయంలో బాత్రూంలో దాక్కున్నా

న్యూజిలాండ్ స్టార్ పేసర్.. కైలె జామీసన్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కించుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ లో ఈ ఘనత సాధించిన బౌలర్..

WTC final: ఇండియాపై ఇన్నింగ్స్ సమయంలో బాత్రూంలో దాక్కున్నా

Jamieson

WTC Final:  న్యూజిలాండ్ స్టార్ పేసర్.. కైలె జామీసన్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కించుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ లో ఈ ఘనత సాధించిన బౌలర్.. ఇండియాపై చేజింగ్ సమయంలో మాత్రం బాత్రూంలో దాక్కున్నాడట. రిజర్వ్ డే చివరి ఇన్నింగ్స్ కు టీమిండియా 139 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఉత్కంఠగా మారిన టార్గెట్ ను కివీస్ సునాయాసంగా సాధించేసింది. కేన్ విలియమ్సన్.. రాస్ టేలర్ భాగస్వామ్యంలో 96 పరుగులు రావడంతో విజయతీరాలకు చేరడం సులువైంది. ఇంతటి మెగా ట్రోఫీ కోసం జరిగిన పోరాటంలో డ్రెస్సింగ్ రూం అంతా సైలెంట్ గా మారిపోయిందట. ఇండియన్ అభిమానుల జోష్ వినలేక తాను బాత్రూంలోనే దాక్కొని ఉండిపోయానని జామీసన్ చెబుతున్నారు.

నేను ఆడుతూ.. ప్రత్యక్షంగా చూస్తున్న మ్యాచ్ లలో ఇదే క్లిష్టమైన సమయం. మేం లోపల కూర్చొని టీవీలో మ్యాచ్ చూస్తున్నాం. అక్కడ కొద్ది క్షణాల పాటు ఆలస్యం అవుతుంది. సింగిల్ పరుగు తీయడానికి ముందుకువెళ్లినా సరే.. అప్పుడే ఇండియన్ క్రౌడ్.. వికెట్ పడిపోయిందంటూ అరుస్తున్నారు.

ఆ మ్యాచ్ చూడటం చాలా టఫ్ గా అనిపించింది. దాదాపు బాత్రూంలోనే ఉండిపోయా. అక్కడ మాత్రమే బయట నుంచి ఏ శబ్ధం వినిపించకుండా ఉంది. కేన్, రాస్ బయట ఉండటం మంచి పనేంది. ఇద్దరు గ్రేటెస్ట్ బ్యాట్స్ మెన్ ప్రశాంతంగా మ్యాచ్ ను ముగించారని చెప్పుకొచ్చాడు.