WTC Final : భారత్‌‌పై న్యూజిలాండ్ విజయం

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో భారత్ గెలుస్తుందని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఫైనల్ లో భారత్ పై న్యూజిలాండ్ జట్టు 8 వికెట్ల తేడాతో సాధించింది. ఇందులో భారత్ చిరస్మరణీయమైన గెలుపు సాధిస్తుందని అనుకున్న వారి ఆశలు నెరవేరలేదు.

WTC Final : భారత్‌‌పై న్యూజిలాండ్ విజయం

Wtc Final

WTC Final : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో భారత్ గెలుస్తుందని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఫైనల్ లో భారత్ పై న్యూజిలాండ్ జట్టు 8 వికెట్ల తేడాతో  గెలుపొందింది. ఇందులో భారత్ చిరస్మరణీయమైన గెలుపు సాధిస్తుందని అనుకున్న వారి ఆశలు నెరవేరలేదు.

సెకండ్ ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాట్స్ మెన్స్ చేతులు ఎత్తేశారు. ఫలితంగా..కేవలం 170 పరుగులకు ఆలౌట్ అయ్యింది. న్యూజిలాండ్ టీమ్ కు ఇన్నింగ్స్ లో 32 పరుగుల అధిక్యం లభించింది. దీంతో ఆ టీమ్ ముందు 139 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్వల్ప లక్ష్యమే కావడంతో..కివీస్ బ్యాట్స్ మెన్స్ ఆడుతూ..పాడుతూ ఆడారు. నిర్దేశిత లక్ష్యాన్ని 45.5 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్ విలియమ్సన్, టేలర్ లు చివరి వరకకు క్రీజులో ఉండి..జట్టును గెలిపించారు.

ఓపెనర్ టామ్ లాథమ్ కేవలం 9 పరుగుల వద్ద వెనుదిరిగాడు. మరో ఓపెనర్ కాన్వే..నిలకడగా ఆడుతూ స్కోరు పెరిగేందుకు కృషి చేశారు. ఇతనికి విలియమ్సన్ జత కలిశాడు. భారత బౌలర్లను విలియమ్సన్ సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. కేవలం 86 బంతులను ఎదుర్కొన్న ఇతను..హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. జట్టు స్కోరు 44 పరుగుల వద్ద కాన్వే (19) అవుట్ అయ్యాడు. విలియమ్సన్ (52 నాటౌట్), టేలర్ (47 నాటౌట్) లు జట్టును విజయతీరాలకు చేర్చారు. రెండు వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసి టీమిండియాపై విజయం సాధించింది.

అంతకుముందు బ్యాటింగ్ కు దిగిన టీమిండియా క్రికెటర్లు ఏ మాత్రం పోరాటం చూపలేదు కివీస్ బౌలర్ల ఎదుట తలవంచారు. ప్రధానంగా టాప్, మిడిల్ ఆర్డర్ ఘోరంగా వైఫల్యం చెందింది. ఒక్క రిషబ్ పంత్ మాత్రమే 41 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా ఉన్నాడు. కొద్దిసేపైనా క్రీజుల్లో నిలిచి..స్కోరు మరింత పెంచుతాడని భారత క్రీడాభిమానులు ఆశించారు. కానీ ఓ చెత్త షాట్ తో వెనుదిరిగాడు. కివీస్ బౌలర్లలో సౌథీ 4, బౌల్ట్ 3, జేమిసన్ 2, వాగ్నర్ 1 వికెట్ తీశారు.