WTC Final: టీమిండియా ఆలౌట్.. 138 పరుగుల ఆధిక్యం

వరల్డ్ చాంపియన్ టెస్ట్ లో భాగంగా సౌతాంప్టన్ వేదికగా జరుగుతోన్న మ్యాచ్ లో టీమిండియా 170పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోరు 64/2తో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా ముందుగా ...

WTC Final: టీమిండియా ఆలౌట్.. 138 పరుగుల ఆధిక్యం

Team India

WTC Final: వరల్డ్ చాంపియన్ టెస్ట్ లో భాగంగా సౌతాంప్టన్ వేదికగా జరుగుతోన్న మ్యాచ్ లో టీమిండియా 170పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోరు 64/2తో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా ముందుగా 71 పరుగుల వద్ద కోహ్లీ వికెట్ చేజార్చుకుంది. క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించి కివీస్ బౌలర్ల చేతిలో అత్పల్ప స్కోరుకే వికెట్లు కూలాయి.

ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన పంత్ (41; 88బంతుల్లో 4ఫోర్లు)తో నిలదొక్కుకున్నాడు. బ్యాటింగ్ లో మెరుగు కనబరిచి సత్తా చాటడంతో టీమిండియా స్కోరు ఊపందుకుంది. ఏడో వికెట్ గా అవుట్ అయిన పంత్.. స్కోరు బోర్డును 156పరుగులకు చేర్చాడు. 138 పరుగుల ఆధిక్యాన్ని చేధించే క్రమంలో న్యూజిలాండ్ జట్టు రెడీ అవుతుంది.

ఫైనల్ మ్యాచ్ కావడంతో రిజర్వ్ డే ఉండగా.. ఆరవ రోజు కూడా మ్యాచ్ జరుగుతోంది. ఆరో రోజు వాతావరణం అనుకూలిస్తుండటంతో మ్యాచ్ ఆటంకం లేకుండా సాగుతుంది.