WTC final: కెప్టెన్‌గా ధోనీ రికార్డ్ బ్రేక్ చేసిన కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముంగిట పలు రికార్డులు ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం జరుగుతోన్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో కెప్టెన్ గా ధోనీ రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. సౌతాంప్టన్ వేదికగా శనివారం పడిన టాస్ తో... కెప్టెన్ గా ధోనీకి మించిన రికార్డులు నమోదయ్యాయి.

WTC final: కెప్టెన్‌గా ధోనీ రికార్డ్ బ్రేక్ చేసిన కోహ్లీ

Kohli Dhoni

WTC final: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముంగిట పలు రికార్డులు ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం జరుగుతోన్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో కెప్టెన్ గా ధోనీ రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. సౌతాంప్టన్ వేదికగా శనివారం పడిన టాస్ తో… కెప్టెన్ గా ధోనీకి మించిన రికార్డులు నమోదయ్యాయి.

కెప్టెన్ గా ధోనీ 61 టెస్టు మ్యాచ్ లు ఆడాడు. మ్యాచ్ కు ముందు ఇద్దరూ 60టెస్టు మ్యాచ్ ల కెప్టెన్లుగా సమానంగా ఉన్నారు. న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో కోహ్లీ ఆరికార్డు బ్రేక్ చేశాడు.

టెస్టు కెప్టెన్ గా ధోనీ డిసెంబర్ 2014లో తప్పుకుంటూ ఆ బాధ్యతలను విరాట్ కోహ్లీకి అప్పగించాడు. రెండు సార్లు వరల్డ్ కప్ విన్నర్ అయిన టీమిండియా మాజీ కెప్టెన్ 60 మ్యాచ్ లకు కెప్టెన్సీ వహించాడు. ఇక కోహ్లీ పేరిట మరో రికార్డు నమోదయ్యింది. మేజర్ ఐసీసీ టోర్నీల్లో ఎక్కువ ఫైనల్ మ్యాచ్ లలో ఆడిన క్రికెటర్ గా చరిత్రకెక్కాడు.

టెస్టు ఫార్మాట్ లో ఎక్కువ కాలం కెప్టెన్ గా వ్యవహరించిన వారిలో.. ఆసియన్ కెప్టెన్ గా కోహ్లీనే ముందంజలో ఉన్నాడు. ఆ తర్వాత శ్రీలంక ప్లేయర్ అర్జున రణతుంగా, పాకిస్తాన్ ప్లేయర్ మిస్బా ఉల్ హఖ్ లు చెరో 56మ్యాచ్‌లకు కెప్టెన్ గా వ్యవహరించారు.