WTC Final: టీమిండియాకు సరైన మైండ్‌సెట్ ప్లేయర్లను తీసుకోవాల్సిన అవసరముంది – కోహ్లీ

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో టీమిండియా రన్నరప్ గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో ఎదురైన ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఇరు జట్లను కుంగదీయగా చివరి రోజు పర్‌ఫార్మెన్స్‌తో కివీస్ విజయాన్ని సొంతం చేసుకుంది.

WTC Final: టీమిండియాకు సరైన మైండ్‌సెట్ ప్లేయర్లను తీసుకోవాల్సిన అవసరముంది – కోహ్లీ

Virat Kohli (1)

WTC Final: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో టీమిండియా రన్నరప్ గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో ఎదురైన ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఇరు జట్లను కుంగదీయగా చివరి రోజు పర్‌ఫార్మెన్స్‌తో కివీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. మ్యాచ్ అనంతరం జట్టు ప్రదర్శన గురించి కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడాడు.

న్యూజిలాండ్ జట్టులో ప్లేయర్లు రెస్పాన్సిబిలిటీని తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. కానీ, మన వైపు కొందరిలో ఆ స్థాయి ప్రదర్శన కనిపించలేదని కోహ్లీ అన్నాడు. 54బంతులు ఆడిన పూజారా.. కేవలం 8పరుగులు మాత్రమే చేయగలిగాడు. అది కూడా మొదటి పరుగు చేయడం కోసం 35బంతుల వరకూ తీసుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో 80బంతుల్లో 15పరుగులు మాత్రమే నమోదు చేశాడు.

మన జట్టులో లోపాలను సరిదిద్దుకునే పనిలో ఉన్నాం. కావాల్సిన బలం పుంజుకుని సరైన పద్ధతిలో బలపరుచుకుంటాం. సంవత్సరం వరకూ వెయిట్ చేసి ప్లాన్ చేసుకునేది లేదు. మన వైట్ బాల్ టీంను చూస్తే తెలుస్తుంది కదా.. ఎంత కాన్ఫిడెంట్ గా రెడీగా ఉంటారో… అలాగే టెస్టు క్రికెట్ లోనూ తీసుకురావాలనుకుంటున్నాం.

టీం వర్కౌట్ అవడానికి డైనమిక్స్ ను అర్థం చేసుకుని రీ ప్లాన్ చేయాల్సి ఉంది. కరెక్ట్ మనుషులను కరెక్ట్ మైండ్ సెట్ తో ఉన్న వాళ్లను టీంలోకి తీసుకోవాలనుకుంటున్నామని కెప్టెన్ అన్నాడు.

ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇండియా కేవలం 217పరుగులు మాత్రమే చేయగలిగింది. అదే సెకండ్ ఇన్నింగ్స్ లో అంతకంటే తక్కువగా 170పరుగులే చేసింది. ‘బెటర్ ప్లాన్స్ కోసం కచ్చితంగా కృషఇ చేస్తాం. గేమ్ మూమెంటం మార్చకుండా.. చూస్తాం. ఎటువంటి టెక్నికల్ సమస్యలు లేవనే అనుకుంటున్నా’ అని కోహ్లీ అన్నాడు.

గేమ్ పై పూర్తి అవగాహన లేకపోవడం, ప్రత్యర్థుల ధైర్యం బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టేసింది. ఒకే ప్రాంతంలో బాల్ వేయడానికి అనుకూలించకుండా బాల్ స్వింగింగ్ కారణమైంది. టెస్టు పరిస్థితుల్ని బట్టి.. స్కోరు చేసి ఉండాల్సింది. ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెడితే సరిపోయేది. న్యూజిలాండ్ క్వాలిటీ బౌలింగ్ అటాక్ తో కుదరకుండాపోయింది’ అని విరాట్ ముగించాడు.