Yashasvi Jaiswal: దశ తిరిగింది.. తొలిసారి టీమిండియాతో ప్రాక్టీస్ సెషన్‌లో జైస్వాల్.. కోహ్లీతో.. వీడియో
టీమిండియాతో అతడు త్వరలోనే లండన్‌కు వెళ్లనున్నాడు.

Yashasvi Jaiswal
WTC Final 2023 – Yashasvi Jaiswal: రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (21) తొలిసారి టీమిండియాతో ప్రాక్టీస్ సెషన్ లో కనపడ్డాడు. ఐపీఎల్(IPL – 2023)లో యశస్వి జైస్వాల్ అదరగొట్టిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌లోని ఓవల్ మైదానంలో జూన్ 7 నుంచి 11 వరకు టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ (ICC World Test Championship final 2023) జరనుంది.
ఇందులో స్టాండ్ బై ఆటగాడిగా రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో యశస్వి ఎంపికయ్యాడు. దీంతో టీమిండియాతో అతడు త్వరలోనే లండన్‌కు వెళ్లనున్నాడు. అతడు ప్రాక్టీస్ చేస్తోన్న వీడియోను బీసీసీఐ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. జైస్వాల్ ఫస్ట్ లుక్ అని పేర్కొంది.
నెట్స్ లో అతడు షాట్లు కొడుతూ కనపడ్డాడు. అతడికి ఇదే సెషన్ లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ టిప్స్ చెప్పాడు. జైస్వాల్ ఐపీఎల్ లో 14 మ్యాచులు ఆడి 625 పరుగులు చేశాడు. ఓ సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు అందులో ఉన్నాయి. అద్భుత ఫాంలో ఉన్న అతడు డబ్ల్యూటీసీ తుది జట్టులో స్థానం సంపాదించుకోవాలని కోరుకుంటున్నాడు.
View this post on Instagram
IPL 2023 Final: నాకు నిద్ర కూడా పట్టలేదు..! ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి గురించి మౌనంవీడిన గుజరాత్ బౌలర్