WTC Final: రాజస్థాన్ ఓపెనర్‌కు బంపర్ ఆఫర్..! అదృష్టం అంటే ఇతడిదే.. ఆ ఆటగాడి స్థానంలో..!
ఐపీఎల్ 2023లో అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు అదృష్టం కలిసివచ్చినట్లు తెలుస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన టీమ్ఇండియాలో స్టాండ్ బై ఆటగాడిగా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో యశస్వి ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Yashasvi Jaiswal to replace Ruturaj Gaikwad
WTC Final 2023: ఐపీఎల్(IPL) 2023లో అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)కు అదృష్టం కలిసివచ్చినట్లు తెలుస్తోంది. లండన్‌లోని ఓవల్ మైదానంలో జూన్ 7 నుంచి 11 వరకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final) మ్యాచ్‌లో అతడికి చోటు దక్కినట్లు సమాచారం. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన టీమ్ఇండియాలో స్టాండ్ బై ఆటగాడిగా ఉన్న రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) స్థానంలో యశస్వి ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం రుతురాజ్ గైక్వాడ్ జూన్ 3న వివాహం చేసుకోనున్నాడు. దీంతో అతడు ఐపీఎల్ ముగియగానే లండన్ విమానం ఎక్కడం లేదు. ఈ విషయాన్ని ఇప్పటికే బీసీసీఐ దృష్టికి తీసుకువెళ్లాడు. అతడు జూన్ 5 తరువాతే జట్టుతో కలవనున్నాడు.
ఈ నేపథ్యంలో రుతురాజ్ గైక్వాడ్‌కు ప్రత్యామ్నాయం చూడాల్సిందిగా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సెలక్టర్లను కోరినట్లు ఓ బీసీసీఐ అధికారి చెప్పాడట. దీంతో యశస్వి జైస్వాల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారని, అతడు త్వరలోనే లండన్‌కు వెళ్లి జట్టుతో కలవనున్నాడని ఆ కథనాల సారాంశం. ఈ విషయం విన్న యశస్వి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమ్ఇండియాకు ఓ గుడ్‌న్యూస్.. మరో బ్యాడ్‌న్యూస్..!
ఐపీఎల్‌లో విధ్వంసం
ఈ సీజన్‌లో యశస్వి జైస్వాల్ విధ్వంసం సృష్టించాడు. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ నిలకడగా పరుగులు సాధించాడు. ఓ మ్యాచ్‌లో శతకం బాదాడు. మొత్తంగా 14 ఇన్నింగ్స్‌లో 48.07 సగటుతో 16.361 స్ట్రైక్ రేటుతో 625 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 124. అత్యధిక పరుగుల సాధించిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లోనూ మెరుగైన రికార్డును కలిగి ఉన్నాడు. 15 మ్యాచుల్లో 80.21 సగటుతో 1845 పరుగులు చేశాడు. ఇందులో 9 తొమ్మిది సెంచరీలు, రెండు అర్ధశతకాలు ఉన్నాయి.
టీమ్ఇండియాను వెంటాడుతున్న గాయాలు
టీమ్ఇండియాను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే బుమ్రా, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్‌లు డబ్ల్యూటీసీ ఫైనల్ తుది జట్టును ఎంపిక చేయకముందే దూరం అయిన సంగతి తెలిసిందే. అనంతరం జట్టును ఎంపిక చేసిన తరువాత కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. అతడి స్థానంలో ఇషాన్ కిషన్‌ను తీసుకోగా అతడికి గాయమైంది. ఇషాన్ కిషన్ గాయం తీవ్రతపై ఇప్పటికైతే ఎటువంటి అప్‌డేట్‌లు లేవు కానీ.. తీవ్రం అయితే మాత్రం అతడు ఫైనల్‌కు దూరం కావడం ఖాయంగా తెలుస్తోంది.
WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ గెలిస్తే ఎంతిస్తారంటే..?
డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు భారత జట్టు ఇదే: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్)
స్టాండ్‌బై ఆటగాళ్లు: రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్, సూర్యకుమార్ యాదవ్