నువ్వు మా రియల్ లైఫ్ హీరో.. అంటోన్న హార్దిక్, చాహల్‌లు

నువ్వు మా రియల్ లైఫ్ హీరో.. అంటోన్న హార్దిక్, చాహల్‌లు

గౌతం గంభీర్, సౌరవ్ గంగూలీ, సురేశ్ రైనాలు పెద్ద మొత్తంలో PM-CARES రిలీఫ్ ఫండ్‌కు డొనేట్ చేశారు. బాలీవుడ్ హీరోల్లో, క్రికెటర్లలో ఎవ్వరూ ఇవ్వనంత భారీ విరాళాన్ని ఇచ్చారు అక్షయ్ కుమార్. రూ.25కోట్ల రూపాయలు ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కు ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. అక్షయ్ ఇచ్చిన విరాళానికి యావత్ దేశమంతా ప్రశంసలతో ముంచెత్తుతుంటే హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్ లు నువ్వే మా రియల్ హీరో అంటూ పొగడ్తలు కురిపించారు. 

రోజులు పెరుగుతున్న కొద్దీ కరోనా మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది. చేతుల్లో నుంచి పరిస్థితులు జారిపోతున్నాయంటూ డాక్టర్లు, రీసెర్చర్లు  జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఇప్పటివరకూ ఎటువంటి వ్యాక్సినేషన్లు కనుగొనకపోవడం పరిస్థితులను మరింత దిగజార్చుతోంది. 

భారత్ ప్రస్తుతం 21రోజుల లాక్ డౌన్‌తో కరోనాపై పోరాడుతుంది. ఏప్రిల్ 14వరకూ బయటకు తిరిగేది లేదంటూ మోడీ దగ్గర్నుంచి ఆంక్షలు విధించారు. రెండో దశ నుంచి మూడో దశకు చేరుకున్న క్రమంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు అధికారులు. దేశంలో లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ డెత్ రేట్ పెరుగుతూనే ఉంది. ఫిల్మ్ స్టార్లు మాత్రమే కాక, వ్యాపారస్థులు, సాధారణ ప్రజలు అంతా సెల్ఫ్ క్వారంటైన్ లోనే ఉంటున్నారు. 

ప్రమాదం నుంచి కోలుకోవడానికి పలువురు చేయూత అందిస్తున్న క్రమంలో అక్షయ్ భారీ విరాళాన్ని ప్రకటించారు. టాటా ట్రస్ట్ అధినేత రూ.500కోట్ల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు.