Yuvraj Singh : యువరాజ్​ సింగ్ అరెస్ట్..వెంటనే బెయిల్

టీమిండియా మాజీ ఆల్ రౌండర్​ యువరాజ్​ సింగ్​ను సోమవారం హర్యానా పోలీసులు అరెస్ట్​ చేశారు.

10TV Telugu News

Yuvraj Singh టీమిండియా మాజీ ఆల్ రౌండర్​ యువరాజ్​ సింగ్​ను సోమవారం హర్యానా పోలీసులు అరెస్ట్​ చేశారు. హర్యానాలోని హిసార్ జిల్లా హన్సిలో యువరాజ్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. యువరాజ్​ అరెస్ట్​కు అనుచిత వ్యాఖ్యలే కారణమని తెలుస్తోంది. గత సంవత్సరం ఫిర్యాదు చేసిన కేసులో యువరాజ్ కులాన్ని దూషించే పదాలను ఉపయోగించారని ఆరోపణలపై అరెస్టయ్యాడు.

ఈమేరకు ఎస్‌-ఎస్టీ అట్రాసిటీ కేసులో యువరాజ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ కేసులో యువరాజ్‌ను అరెస్టు చేశారు. అయితే, ఈ కేసులో అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. హైకోర్టు ఆదేశాల మేరకు వెంటనే యువరాజ్‌ను విడుదల చేశారు. బెయిల్ వచ్చిన అనంతరం యువీ చండీగఢ్ వెళ్లాడు.

అసలేం జరిగింది
గతేడాది భారత క్రికెటర్​ రోహిత్ శర్మ‌తో కలిసి యువరాజ్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్​ లైవ్‌లో మాట్లాడాడు. ఆ సందర్భంగా క్రికెటర్ చాహల్‌ పై యువీ సరదాగా కామెంట్ చేశారు. చాహల్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి వీడియోలు పోస్ట్‌ చేస్తున్నాడని.. బాంగీ మనుషుల్లా వీళ్లకు పని పాటా లేదా అని యువీ వ్యాఖ్యానించారు. ఆ మాటలకు రోహిత్​ నవ్వి ఊరుకున్నారు. ఆ వీడియో అప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దళితులను కించపరిచేలా యువరాజ్ మాట్లాడాడని నెటిజన్లు ఫైర్ అయ్యారు.

దళిత వర్గానికి చెందిన ఓ కులాన్ని బాంగీ పిలుస్తారు. వీధులు ఊడ్చే వారిని దిగువ స్థాయి కులాలకు చెందిన వారిని బాంగీగా పిలుస్తారు. ఈ పరిణామంపై యువరాజ్ సింగ్ పై హర్యాణా దళిత హక్కుల నేత రజత్ కల్సన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హిసార్‌ ప్రాంతంలో యువరాజ్‌పై పోలీసు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై గతేడాది జూన్​లోనే యువరాజ్​ సింగ్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ ద్వారా​ క్షమాపణలు చెప్పాడు. యువీ ఆ ట్విట్టర్ పోస్ట్ లో… కులం, రంగు, మతం, లింగం వంటి వ్యత్యాస్యాలను నేను పట్టించుకోనన్నారు. ప్రతీ ఒక్కరికి గౌరవం ఇవ్వాలని, ఒకరికొకరం మర్యాదగా నడుచుకోవాలని భావిస్తానన్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని.. ఏది ఏమైనా తన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలైన దెబ్బతిని ఉంటే వారందరికి క్షమాపణలు తెలియజేస్తున్నానని..తన వ్యాఖ్యల పట్ల పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు.

ALSO READ Sanjay Raut : కాంట్రాక్ట్ కిల్లింగ్స్ స్థానంలో గవర్న్‌మెంట్ కిల్లింగ్స్..కేంద్రంపై సేన విమర్శలు