యువరాజ్ సింగ్ బర్త్ డేకు ఐసీసీ విషెస్

యువరాజ్ సింగ్ బర్త్ డేకు ఐసీసీ విషెస్

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‍‌కు ఐసీసీ అద్భుతమైన ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసింది. వరల్డ్ టీ20 తొలి సీజన్లో ఈ లెఫ్ట్ హ్యాండర్ ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాదిన వీడియోను పోస్టు చేస్తూ బర్త్ డే విషెస్ పంపింది. సింపుల్‌గా హ్యాపీ బర్త్ డే అనే పవర్ ఫుల్ పదాలతో పోస్టు చేసింది. 

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు విజయోత్సాహంలో గర్జిస్తున్న యువీని పోస్టు చేసి శుభాకాంక్షలు తెలిపింది. ‘నిజమైన ఛాంపియన్. ఆయనెంతో మందికి ప్రేరణ. హ్యాపీ బర్త్ డే టూ యూ యువరాజ్ సింగ్’ అని పేర్కొంది. 

 

క్రికెట్ అభిమానికి గుర్తుండిపోయే క్షణాలు అవి. 2007 ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్‌ బ్రాడ్ బౌలింగ్ వేస్తున్న ఓవర్లో సిక్సర్ల మోత మోగించాడు యువీ. ఆ పెను సంచలనం జరిగి 12 ఏళ్లు గడిచింది. ఈ విధ్వంసానికి యావత్‌ క్రికెట్‌ ప్రపంచం నివ్వెరపోయింది.

ప్రస్తుత టీమిండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి, హెర్ష్‌లీ గిబ్స్‌లు ముందే ఈ ఘనతను అందుకున్నారు. ఇది వరల్డ్ టీ20 ఫార్మాట్ కావడంతో ఎక్కువ జనాదరణ పొందింది. దేశవాళి క్రికెట్‌లో రవిశాస్త్రి ఈ ఘనత సాధించగా.. గిబ్స్‌ ఓ చిన్నదేశంపై జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌తో ఈ ఫీట్‌ చేయగలిగాడు. ఈ మ్యాచ్‌లో యువీ కేవలం 16 బంతుల్లో 58 పరుగులు నమోదు భారత విజయంలో కీలకంగా నిలిచాడు.