ఇంటివాడైన టీమిండియా స్పిన్నర్ చాహల్

ఇంటివాడైన టీమిండియా స్పిన్నర్ చాహల్

Yuzvendra Chahal Marries Dhanashree Verma : టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) ఓ ఇంటివాడయ్యాడు. పాపులర్ యూట్యూబర్ ధనశ్రీ వర్మ (youtuber dhanashree verma)ను పెళ్లాడాడు. గురుగ్రామ్‌లో వీరి వివాహం కొద్దిమంది కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య జరిగింది. తమ వివాహ ఫొటోలను చాహల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, ఆ వెంటనే అతడి స్నేహితుడు పీయూష్ సచ్‌దేవ్ కూడా పెళ్లి ఫొటోలు షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

ధనశ్రీతో తనకు నిశ్చితార్థం అయినట్టు ఆగస్టులో ప్రకటించిన చాహల్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కొరియోగ్రాఫర్, డాక్టర్ అయిన ధనశ్రీ యూట్యూబర్ కూడా. చాహల్‌తో పాటు ధనశ్రీ కూడా ఆగస్టులో తమ రోకా ఉత్సవానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. ఐపీఎల్‌లో (IPL) రాయల్ చాలెంజర్స్‌కు చాహల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కరోనా (Corona Virus) కారణంగా ఐపీఎల్ దుబాయ్‌కు షిఫ్టవగా కాబోయే భర్తతోపాటు ధనశ్రీ కూడా యూఏఈ వెళ్లింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా కూడా వెళ్లారు.

అయితే, ఆసీస్ పర్యటనలో చాహల్ ప్రదర్శన నిరాశ పరిచింది. రెండు వన్డేల్లో ఒక్క వికెట్ మాత్రమే తీసి 160 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే, తొలి టీ20లో రవీంద్ర జడేజాకు బదులు సబ్‌స్టిట్యూట్‌‌గా బరిలోకి దిగిన చాహల్ నాలుగు ఓవర్లు వేసి 25 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9)