Home » పాండ్యా కోసం ముందుకొచ్చిన వార్నర్: క్రీడా స్ఫూర్తి అంటున్న ఐసీసీ
Published
2 months agoon
By
subhncricket: జెంటిల్‌మ్యాన్ గేమ్ క్రికెట్.. లో మరోసారి అదే క్రీడా స్ఫూర్తి చూపించాడు డేవిడ్ వార్నర్. శుక్రవారం సిడ్నీ వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. ఆస్ట్రేలియా ఓపెనర్ అయిన వార్నర్ ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా షూ లేస్ కట్టాడు.
ఇన్నింగ్స్ 32వ ఓవర్లో షూ లేస్ కట్టుకోవడానికి హార్దిక్ ఇబ్బంది పడుతుండగా వార్నర్ తనకు తానుగా వచ్చి సాయం చేసి లేస్ కట్టాడు. దాని తర్వాత వార్నర్ లేచి ఫీల్డింగ్ కోసం వెనక్కి వెళ్తుండగా హార్దిక్ పాండ్యా చేతితో బంప్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పాడు. సింపుల్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్ ను కెమెరాలు పసిగట్టాయి.
ఈ వీడియోను పోస్టు చేస్తూ ఆస్ట్రేలియా క్రికెట్ తో పాటు ఐసీసీ కూడా ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా టాపార్డర్ పర్ఫెక్ట్ హిట్టింగ్తో రెచ్చిపోవడంతో 6వికెట్ల నష్టానికి 374పరుగులు చేయగలిగింది. చేధనలో నిలకడలేమితో బాధపడిన టీమిండియా 66పరుగుల వ్యత్యాసంతో ఓటమి చవిచూసింది.
Spirit of cricket 🤜 🤛 #AUSvINDpic.twitter.com/V3ySz9go89
— ICC (@ICC) November 27, 2020