Sravani suicide : సాయికృష్ణ, అశోక్ రెడ్డిల విచారణకు పోలీసులు సిద్ధం..చిక్కుముడి వీడేనా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

TV actor Sravani suicide case : టీవీ నటి శ్రావణి కేసు.. పోలీసులను సైతం తికమకపెడుతోంది. ఈ కేసులో నిందితుడు దేవరాజ్‌ అని అంతా భావించారు. బట్‌ కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది. తాను అమాయకుడినని చెప్పుకున్న సాయికృష్ణ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. దేవరాజ్‌ అందించిన సాక్ష్యాలు కేసును కీలకదశకు తీసుకెళ్లాయి. దీంతో 2020, సెప్టెంబర్ 12వ తేదీ శనివారం సాయికృష్ణ, అశోక్‌రెడ్డిని విచారించేందుకు పోలీసులు రెడీ అయిపోయారు.

శ్రావణి మృతి కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు బయటపడుతున్నాయి. దర్యాప్తు చేస్తున్న పోలీసులను సైతం… ఈ కేసు తికమకపెడుతోంది. ప్రతిరోజు కొత్త వీడియోలు బయటపడుతుండడంతో…ఈ కేసు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. రోజురోజుకు కేసు కీలక మలుపులు తీసుకుంటుండంతో… అసలు నిందితులు ఎవరన్న దానిపై పోలీసులు ఓ అంచనాకు రాలేకపోతున్నారు.ఒక రాధ.. ఇద్దరు కృష్ణులు సినిమాలా ఉంది శ్రావణి కేసు. మూడు రోజుల నుంచి సాగుతోన్న పోలీసు విచారణలో ఇదే వెలుగు చూసింది. తొలుత సాయికృష్ణను ప్రేమించిన శ్రావణి.. ఆతర్వాత తన ప్రేమను దేవరాజ్‌పైకి డైవర్ట్ చేసిందన్న నిర్ధారణకు పోలీసులు వచ్చారు.

శ్రావణి కేస్ మొదటి రెండు రోజులు దేవరాజ్ చుట్టూనే తిరిగింది. అయితే మూడో రోజు మాత్రం సాయికృష్ణ వైపు మళ్లింది. పోలీసుల ఎదుట లొంగిపోయిన దేవరాజ్ ఈ కేసులో కీలకమైన సాక్ష్యాలు అందించాడు. ఈనెల 7వ తేదీన శ్రావణి, దేవరాజ్ కలిసి.. ఎస్‌ఆర్‌ నగర్‌లోని శ్రీ కన్య హోటల్ వెళ్లారు. అక్కడికి వచ్చిన సాయి… ఇద్దరినీ చూసి కోపంతో రగిలిపోయాడు. వెంటనే దేవరాజ్‌పై దాడికి దిగాడు.ఆ తర్వాత శ్రావణిపైనా చేయి చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా విషయం ఆమె కుటుంబ సభ్యులకు చెప్పగానే ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. దీనితో శ్రావణి, దేవరాజ్‌కు కాల్ చేసి సూసైడ్ చేసుకుంది. ఆ తర్వాత… శ్రావణి సూసైడ్‌కు దేవరాజ్‌ కారణమంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దేవరాజ్‌ ఇచ్చిన సమాచారంతో.. పోలీసులు… శ్రీ కన్య హోటల్ కి వెళ్లి సిసి ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. అందులో దేవరాజ్ పై దాడి, శ్రావణిపై చేయి చేసుకున్న వ్యవహారం స్పష్టంగా ఉంది. అంతేకాదు ఆర్ ఎక్స్ 100 సినీ నిర్మాత అశోక్ రెడ్డి తో సహజీవనం కోసం సాయి శ్రావణిని వేధించినట్లుగా కొత్త యాంగిల్‌ బయటకొచ్చింది. అందుకే దేవరాజ్‌ను అడ్డు తొలగించుకోవాలని సాయికృష్ణ ప్రయత్నాలు చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.శ్రావణి ప్రేమ కోసం దేవరాజ్‌, సాయికృష్ణ మధ్య తరచూ గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. ఐదు ఏళ్లుగా తాను, శ్రావణి ప్రేమించుకుంటున్నామని సాయికృష్ణ చెబుతుండగా…. శ్రావణి తననే ప్రేమిస్తుందని దేవరాజ్‌ వాదిస్తున్నాడు. వీరిద్దరి సంభాషణకు సంబంధించిన ఆడియో ఒకటి బయటపడింది. అందులో శ్రావణి కూడా దేవరాజ్‌ను ప్రేమిస్తున్నట్టు చెప్పింది.

TV actor Sravani Suicide case : శ్రావణి ఆత్మహత్య కేసులో సీసీ ఫుటేజ్ వెలుగులోకి..!


శ్రావణిని, దేవరాజ్‌ను విడదీయడానికి సాయికృష్ణ అనేక ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తోంది. శ్రావణి కుటుంబ సభ్యులకు దేవరాజ్‌ గురించి చెడుగా చెబుతూ.. తాను మంచివాడననే ముద్ర వేయించుకున్నాడు. దీంతో సాయిని కుటుంబ సభ్యుడిగా భావించిన శ్రావణి ఫ్యామిలీ… దేవరాజ్‌ను శత్రువుగా చూడడం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే దేవరాజ్‌ను కలవద్దని శ్రావణిపై కుటుంబ సభ్యులు ఆంక్షలు విధించినట్టు సమాచారం. హోటల్‌లో గొడవ జరిగిన తర్వాత ఇంటికొచ్చిన శ్రావణితో కుటుంబ సభ్యులు ఆమెతో గొడవపడ్డట్టు తెలుస్తోంది. అయితే తనను సాయి ఎందుకు కొట్టాల్సి వచ్చిందని తల్లిని శ్రావణి నిలదీసినట్టుగా తెలుస్తోంది. రెస్టారెంట్‌లో అందరిముందు కొట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీసింది. తీవ్ర మనస్తాపం చెందిన శ్రావణి ఆరోజు రాత్రే ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ఓ ప్రాథమిక అంచనాకు వచ్చారు.

READ  చంచల్ గూడ జైలుకు రవి ప్రకాష్ : 14 రోజుల రిమాండ్

ఒకవైపు కుటుంబ సభ్యులు దేవరాజ్‌ను కలవొద్దని హెచ్చరికలు చేసినా… శ్రావణి మాత్రం అతడిని చాటుమాటుగా కలిసినట్టు తెలుస్తోంది. అతడి బర్త్‌డే రోజు శ్రావణి విషెస్‌ కూడా చెప్పింది. తాను ఎప్పటికీ దేవరాజ్‌ను ప్రేమిస్తూనే ఉంటానని అందులో చెప్పింది. దేవరాజ్‌ను శ్రావణి కలవడం నచ్చని సాయికృష్ణ.. ఆమెను వేధించినట్టు పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. దీంతో శనివారం సాయికృష్ణ, అశోక్‌రెడ్డిని పోలీసులు విచారించనున్నారు.శ్రావణి ఆత్మహత్యకు బలమైన కారణాలు నేటి విచారణలో తెలిసే అవకాశముంది. సాయికృష్ణ, దేవరాజ్‌ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుండడంతో… ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి పోలీసులు విచారించే అవకాశముంది. రెస్టారెంట్‌లో శ్రావణిపై దాడి చేయడానికి కారణాలపైనా పోలీసులు కూపీ లాగనున్నారు. సాయి, అశోక్‌రెడ్డి స్టేట్‌మెంట్‌ తర్వాత ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.

Related Posts