లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

SRH vs MI, ప్లే ఆఫ్‌కి వెళ్లాలంటే గెలవాలి: కీలక మ్యాచ్‌లో ముంబైపై టాస్ గెలిచిన హైదరాబాద్

Published

on

SRH vs MI IPL 2020: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL‌ 2020)‌ 13వ సీజన్ ఆఖరి దశకు చేరుకుంది. ఈ టోర్నీ లీగ్‌ దశలో మ్యాచ్‌లకు నేటితో తెర పడనుంది. ముంబై ఇండియన్స్‌‌ అందరికంటే ముందే ఫ్లే ఆఫ్‌‌‌కు చేరుకోగా.. సోమవారం రాయల్ చాలెంజర్స్‌పై గెలుపుతో పాయింట్స్‌‌ టేబుల్‌‌లో సెకండ్‌‌ ప్లేస్‌‌తో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా క్వాలిఫయర్‌‌కు అర్హత సాధించింది. ఢిల్లీ చేతిలో ఓడిన ఆర్‌‌సీబీ కూడా మెరుగైన రన్‌‌రేట్‌‌తో థర్డ్‌‌ ప్లేస్‌‌తో ప్లే ఆఫ్స్‌‌కు క్వాలిఫై అయింది.నాలుగో బెర్త్‌‌ కోసం సన్‌‌ రైజర్స్‌ హైదరాబాద్‌‌తో జరిగే ఆఖరి లీగ్‌‌ మ్యాచ్‌‌లో టేబుల్‌‌ టాపర్‌‌ ముంబై ఇండియన్స్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ టైటిల్ గెలిచిన 2016 పరిస్థితులే ఈ సీజన్‌లో ఎదురవుతుండగా.. సెంటిమెంట్ రిపీట్ అవుతుందని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరీ వారి ఆశలను వార్నర్ సేన నిలబెడుతుందో? లేదో? చూడాలి.గత రెండు మ్యాచ్‌ల్లో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్లు, బౌలర్లు అద్భుతంగా రాణించగా.. జట్టు ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి ప్లే ఆఫ్‌లోకి ప్రవేశించాలని భావిస్తుంది. ఇప్పటివరకు, జట్టు కేవలం 12 పాయింట్లు మాత్రమే సాధించి ఉండగా.. రన్ రేటు మాత్రం చాలా బాగుంది. ప్లే-ఆఫ్ బెర్త్‌ను కన్ఫామ్ చేసుకోవడానికి ముంబైపై విజయం కీలకం కానుంది. అయితే, ముంబై జట్టు కూడా ప్రస్తుతం చాలా మంచి ఫామ్‌లో ఉండగా.. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ గెలుపు ముంబైకి అంత ముఖ్యం కాదు కాబట్టి, ఈ మ్యాచ్‌లో కొత్త వాళ్లు ఆడే అవకాశాలు ఉన్నాయి.ఈ సీజన్ 56వ మ్యాచ్ ఇది కాగా.. షార్జా క్రికెట్ స్టేడియంలో పాయింట్ల పట్టికలో మూడవ ప్లేస్ కోసం హైదరాబాద్ ఎదురు చూస్తుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు టోర్నమెంట్‌కు దూరం అవుతుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుని ముంబై జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ముంబై ఇండియన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించి 18 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.Sunrisers Hyderabad Playing XI: రోహిత్ శర్మ (సి), క్వింటన్ డి కాక్ (WK), సూర్యకుమార్ యాదవ్, సౌరబ్ తివారీ, ఇషాన్ కిషన్, క్రునాల్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, నాథన్ కౌల్టర్-నైల్, రాహుల్ చాహర్, జేమ్స్ ప్యాటిన్సన్, ధావల్ కులకర్ణి

Mumbai Indians Playing XI: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), వృద్దిమాన్ సాహా (WK), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియామ్ గార్గ్, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్, సందీప్ శర్మ, టి నటరాజన్ఈ మ్యాచ్‌లో ట్రెంట్ బోల్డ్, జస్‌ప్రీత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా రెస్ట్ తీసుకున్నారు. వారి స్థానంలో బుమ్రా స్థానంలో కులకర్ణికి, జేమ్స్ ప్యాటిన్సన్, ధావల్ కులకర్ణిలకు జట్టులో చోటు దక్కింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *