కొబ్బరి చెట్టు ఎక్కిన మంత్రి..అక్కడినుంచే మీడియా సమావేశం..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఓ మంత్రిగారు కొబ్బరితోటలో మీడియా సమావేశం ఉందని మీడియావారికి తెలిపారు.మంత్రిగారి సమావేశం కాబట్టి అన్ని మీడియాలకు సంబంధించిన ప్రతినిథులు వచ్చారు. కానీ అక్కడ మంత్రిగారు లేదు. మంత్రిగారు కదా కాస్త ఆలస్యంగా వస్తారని రిపోర్టర్లు అనుకున్నారు. ఇంతలో మంత్రి సమావేశం మొదలు పెడతామా? అని అన్నారు. దీంతో మీడియావాళ్లంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. మంత్రి మాటలు వినిపించాయి గానీ మంత్రికనిపించలేదు. దీంతో మంత్రిగారూ..మీడియా సోదరులారా..ఇదిగో నేను ఇక్కడున్నాను..కొబ్బరి చెట్టుమీద ఇటు చూడండీ..అంటూ కేకలు వేశారు..


దాంతో మీడియావారంతా ఖంగు తిన్నారు. అందరూ మాటలు వినిపించవైపుకు తలఎత్తి చూశారు. అక్కడెక్కడో కొబ్బరి చెట్టుమీద మంత్రిగారు బోండాలు కోస్తూ కనిపించారు. అదేంటీ సార్..సమావేశం మొదలుపెడదామని మీరు అక్కడే ఉన్నారు? అని అడిగారు. దానికి మంత్రి హా..ఇక్కడ నుంచి నేను మాట్లాడతాను..మీరు రాసుకోండి అంటూ.. శ్రీలంకలోని వాయువ్య ప్రాంతంలో మంత్రి అరుండికా ఫెర్నాండో కొబ్బరి బొండాలు కోస్తూ.. అనేక అంశాలను వివరించారు. మంత్రి అలా చెపుకుపోతుంటా మీడియావారంతా అవాక్కవుతూనే ఆయన చెప్పే విషయాలను రికార్డు చేసుకున్నారు. ఇంతకీ కొబ్బరి చెట్టు ఎక్కి బోండాలు కోస్తూ మంత్రి మీడియా సమావేశాన్ని ఎందుకు పెట్టారో చూద్దాం..


ఫెర్నాండో కొబ్బరి, పిష్‌టైల్ పామ్, రబ్బర్ ఉత్పత్తుల శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఆయా చెట్ల గురించి మాట్లాడటానికి రిలవెంట్ గా ఉండేలా వినూత్నంగా ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డాంకోటువాలోని తన కొబ్బరి ఎస్టేట్‌లోకి మీడియా ప్రతినిధులను పిలిపించారు. కొబ్బరి సంబంధింత ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో.. కొబ్బరికాయల ధరలు కూడా విపరీతంగా పెరిగాయని తెలిపారు.


అంతేకాదు.. కొబ్బరి కాయలు కోసే కూలీల పరిస్థితిపై మాట్లాడారు. కూలీలు చెట్టు ఎక్కి కాయలు కోసేందుకు ఒక్కొ చెట్టుకు ఆయా తోటల యజమానులు 100 రూపాయలు ఇవ్వాలని తెలిపారు. ఈ విషయం అర్థం కావాలనే తాను ఇలా చెట్టెక్కి మాట్లాడుతున్నానని వివరించారు. ఈ సందర్భంగా సులువుగా కొబ్బరిచెట్లు ఎక్కే యంత్రాన్ని కూడా మంత్రి పరీక్షించారు.


కొబ్బరికాయలను ప్రజలు అనువైన ధరల్లో అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.కరోనా వల్ల వచ్చిన లాక్ డౌన్ తో కొబ్బరి ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులు తగ్గాయని కానీ తాము తగిన చర్యలు తీసుకోవటంతో గత జూలైలో ఎగుమతులు పెరిగాయని తెలిపారు.

Related Posts