Sri Rama Navami Special Story

నిడారంబంరంగా శ్రీరామనవమి. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎలా సాగిందంటే?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

 

భద్రాద్రి క్షేత్రంలో శ్రీరామనమి మహోత్సవంలో ఏలోటూ రాకపోయినా, భక్తులను మాత్రం అనుమతించలేదు. నిడారంబరంగా సాగింది. చరిత్రలో ఇలా ఎన్నడూ శ్రీరామనవమి జరగలేదని ఆధ్యాత్మికవేత్తలన్నారు. ఒక్క భద్రాద్రేకాదు,దేశవ్యాప్తంగానూ అన్ని రామాలయాల్లో భక్తులులేకుండా రఘురాముడి కళ్యాణమహోత్సవాన్ని నిర్వహించారు. 

భద్రాద్రి :

t

తెలంగాణ భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలో, గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ ఆలయాన్ని కంచర్ల గోపన్న కట్టించాడు. ఓ రోజు రామయ్య ఆయన కలలోకి వచ్చి భద్రాచలం కొండమీద గుడి కట్టించమని అడిగాడట. గోపన్న ఎప్పుడూ రామకీర్తనలు పాడటంతో రామదాసుగా ప్రసిద్దికెక్కాడు. ఈ ఆలయానికి మరో పేరు శ్రీరామ దివ్యక్షేత్రం. పరమ పవిత్రమైన గౌతమి నది తీరాన శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై స్వయంభువుగా కొలువైన ప్రాంతం భద్రాద్రి క్షేత్రం.

ఇకపోతే భద్రాచలం రామాలయంలో ఈసారి శ్రీ సీతారాముల కల్యాణాన్ని కరోనా వైరస్ కారణంగా భక్తజనాలు లేకుండానే నిర్వహించారు. భద్రాద్రి రామాలయంతో పాటు అన్ని ఊళ్లలోని ఆలయాల్లోనూ ఇదే పరిస్థితి. భక్తులెవరూ భద్రాద్రి వెళ్లలేదు. ఈసారి టీవీల్లోనే ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు.

ఒంటిమిట్ట కోదండరామస్వామి:

gh
ఏపీలోని ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణోత్సవం ప్రతీఏట అంగరంగ వైభవంగా జరిగేది. ఈ క్షేత్రాన్ని ఏకశిలీ నగరంగా కూడా పిలుస్తారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే శిలలో రాముడు, సీతాదేవి మరియు లక్ష్మణులను ఇక్కడ చూడవచ్చు. అందుకే ఏకశిలా నగరం అన్ని పేరొచ్చింది. ఆంజనేయ స్వామి లేకుండా రాముల వారు ఉన్న ఆలయం ఇదొక్కటే. కోదండరామ స్వామి ఆలయానికి మూడు ప్రధాన గోపురద్వారాలు ఉన్నాయి. ఆ గోపురాల ద్వారా లోనికి వెళితే విశాలమైన మైదానం ఉంది. ఆలయ ముఖద్వారం ఎత్తు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించారు. 

ఈసారి కరోనా కారణంగా రద్దు చేస్తూ.. టీటీడీ కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

కుంభకోణం రామస్వామి:

g
తమిళనాడులోని కుంభకోణంలో రామస్వామి దేవాలయానికి దక్షిణ అయోధ్య అని పేరు ఉంది. ఆ దేవాలయంలోని ములవిరాట్టు విగ్రహాలే ఇందుకు కారణం.ముఖ్యంగా 12 ఏళ్లకు ఒకసారి వచ్చే మహామహం ఉత్సవంతో సంబంధమున్న దేవాలయల్లో రామస్వామి దేవాలయం కూడా ఒకటి. ఆలయంలోని మండపంలో 62 స్తంభాలు ఉంటాయి. ఈ స్తంభాల పై ఉన్న శిల్ప సౌదర్యం భారతీయ శిల్పకళకు అద్దం పడుతుందడంలో అతిశయోక్తి లేదు. ఈ ఆలయాన్ని రఘునాయకుడు నిర్మించాడు. తంజావూరు రాజ్యాన్ని క్రీస్తు శకం 1614 నుంచి 40 వరకూ పరిపాలించిన రఘునాయకుడు గొప్ప రామ భక్తుడు. దాదాపు 400 ఏళ్ల క్రితం నిర్మించబడిన ఈ ఆలయాల్లోని విగ్రమాలు సాలిగ్రామ శిలతో చేయబడినవి. ఒక్కొక్క విగ్రహం ఎత్తు 8 అడుగుల పైనే ఉంటాయి.

ఓర్చా రాజారామ్:

g
మధ్యప్రదేశ్‌లోని తికంగర్ జిల్లాలో బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో బేత్వానది వంపు తిరిగినచోట ఏర్పడిన దీవిలోని చిన్న ఊరే ఓర్చా. ఇక్కడ రాముడిని ఓ రాజుగా పూజిస్తారు. రాముడి కుడి చేతిలో కత్తి, ఎడమచేతిలో డాలుతో పద్మాసనం వేసుకున్న భంగిమలో కొలువైన రాముడి ఎడమవైపున సీతాదేవి కుడివైపు లక్ష్మణుడు, పాదాలదగ్గర హనుమంతుడు కనిపిస్తారు. ఇక్కడ రాజ్యమేలే రాముడి ఎడమకాలి బొటనవేలు దర్శనం అయితే చాలంట, మనసులో ఏ కోరిక కోరుకున్న కచ్చితంగా నెరవేరుతుందనేది అక్కడి భక్తుల నమ్మకం. 

నాసిక్ కాలారామ్:

h
నాసిక్ లోని పంచవటి ప్రాంతంతో శ్రీరాముడితో ముడిపడిన అంశాలు, గుర్తులు దర్శనీయాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ రాముడు నల్లని శిలతో దర్శనమిస్తాడు. అందుకే ఇక్కడి రాముణ్ణి కాలారామ్ గా కొలుస్తారు. ఇది నాసిక్ లో పంచవటీ క్షేత్రంలో వున్న అద్భుత మందిరం. శ్రీరామచంద్రుడు తన వనవాస కాలంలో నివసించిన ప్రదేశంలోనే ఈ మందిర నిర్మాణం జరిగిందంటారు. ఓ రోజు సర్దార్ రంగారావు అనే వ్యక్తికి గోదావరి నదిలో రాముడి విగ్రహం ఉన్నట్లు కల వచ్చిందట. అంతేకాదు కలలో వచ్చినట్టే అదే స్థలంలో అతనికి రాముడి విగ్రహం కనిపించడంతో వెంటనే అక్కడ గుడి కట్టించాడు. 

కరోనా భయంతో ఈసారి ఐదుగురు పూజారే శ్రీరామ నవమిమహోత్సాన్ని నిర్వహించారు. ప్రజలు టీవీల్లో, లైవ్ స్ట్రీమింగ్ చూశారు.

అయోధ్యా కనకభవన్:

f

ఉత్తరభారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఈ దేవాలంలో పూజారే పూజలు సాగించారు. భక్తులను అనుమతించలేదు. లైవ్ స్ట్రీమింగ్ ద్వారానే కళ్యాణమహోత్సవాన్ని ప్రసారం చేశారు. ప్రాచీనకాలం నుంచి దీన్ని కౌశల దేశంగా పిలుస్తున్నారు. ఈ భవనాన్ని త్రేతాయుగంలో సీతాదేవి ముఖఆన్ని చూసే సందర్భంలో పెళ్లకానుకగా కైకేయి ఇచ్చిందట. అప్పటినుంచీ దీన్ని పునర్నిర్మించుకుంటూ వచ్చారనేది స్థలపురాణం. ఇందులో మూడు జోడీల సీతారాముల విగ్రహాలు కనిపిస్తాయి. పెద్ద విగ్రహాల్ని రాణీ కున్వారీ ప్రతిష్ఠంచగా, మధ్య సైజు విగ్రహాన్ని విక్రమాదిత్యుడి కాలం నాటివని, చిన్నవి కృష్ణుడు ఈ స్థలంలోనే రామజపం చేసుకుంటున్న భక్తురాలికి సమర్సించినవనీ అనుకుంటారు.  

ఇందల్వాయి:

in

శ్రీరాముడి జీవితంలోకి సీతాదేవి రాకముందు నుంచి లక్ష్మణుడు ఆయన వెంట ఉన్నాడు. అలాంటి లక్ష్మణుడు లేని రామాలయం ఉంటుందా అనుకోవద్దు. కానీ, ఉంది. నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి గ్రామంలో లక్ష్మణుడు లేని రామాలయం ఉంది. దేశంలో ఇలాంటి ఆలయం ఇదొక్కటే.

Related Posts