లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Uncategorized

వేములవాడలో సీతారాముల కల్యాణం : శివుడితో జోగినిల పెళ్లి

కేవలం వైష్ణవ ఆలయాల్లోనే శ్రీరామ నవమి జరుగుతుంది అనుకుంటే పొరపాటు.. శైవ క్షేత్రంలో వైష్ణవ సాంప్రదాయ ప్రకారం నవమి వేడుకలు జరుగుతాయి.

Published

on

Sri Rama Navami At Vemulawada Rajanna Temple

కేవలం వైష్ణవ ఆలయాల్లోనే శ్రీరామ నవమి జరుగుతుంది అనుకుంటే పొరపాటు.. శైవ క్షేత్రంలో వైష్ణవ సాంప్రదాయ ప్రకారం నవమి వేడుకలు జరుగుతాయి.

కేవలం వైష్ణవ ఆలయాల్లోనే శ్రీరామ నవమి జరుగుతుంది అనుకుంటే పొరపాటు.. శైవ క్షేత్రంలో వైష్ణవ సాంప్రదాయ ప్రకారం నవమి వేడుకలు జరుగుతాయి. ఇందుకు సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయమే ప్రత్యక్ష ఊదాహరణ. ఏప్రిల్ 13వ తేదీ శనివారం ఆలయంలో సీతారాముల కళ్యాణం జరుగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఈనెల 14న భద్రాచలంలో రాములోరి కల్యాణం కన్నుల పండుగగా జరుగనుంది.

సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. శ్రీరామనవమి వేడుకలకు వేములవాడ రాజన్న ఆలయం అందంగా ముస్తాబైంది. శివరాత్రి తరువాత సీతారాముల కళ్యాణాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహిస్తుంటారు. వేలాది భక్తులు తరలివస్తారు. వేములవాడలో జరిగే కళ్యాణానికి ఓ విశిష్టత ఉంది. ఓ వైపు కళ్యాణం జరుగుతుంటే…మరో వైపు శివుడిని తమ నాథుడిగా భావించి…జోగినిలు ఆ కైలాస నాధుడుని వివాహం ఆడటం విశేషం. శివుడిని పరిణయం ఆడటంలాంటి సాంప్రదాయం చాలా కాలం నుంచి వస్తుంది.
Read Also : Jobsపై స్పీచ్ : చేసేది కూలిపని.. ఇంగ్లీష్ ఇరగదీశాడు

ఓ వైపు దేవతా మూర్తుల కళ్యాణోత్సవం నిర్వహిస్తుంటే…మరో వైపు రాజరాజేశ్వరుడి సన్నిధిలోనే జోగినిలు శివుడిని తమ నాధుడిగా భావిస్తుంటారు. నవమి వేడుకల్లో పాల్గొనడానికి తెలంగాణ నుంచే కాదు… చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఏపీ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ వేడుకలకు జోగినీలు పెద్ద ఎత్తున వేములవాడకు తరలివచ్చారు. ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి శివుడిని దర్శించుకుంటున్నారు.

శివుడికి ప్రతిరూపం అయిన త్రిశూలాన్ని చేతపట్టుకొని సీతారామ కల్యాణం జరిగే ప్రదేశానికి చేరుకుని నృత్యాలు చేస్తున్నారు. రాములోరి కల్యాణంలో పాల్గొన్న జోగినిలంతా.. శివుడిని ప్రాణ నాథుడిగా భావించి వివాహం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. భక్తులకు మంచినీరు, మజ్జిగ అందజేయనున్నారు. చలువ పందిళ్లు వేశారు. ప్రసాదం కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.
Read Also : కోడెలపై దాడి : అంబటి రాంబాబుపై హత్యాయత్నం కేసు

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *