కేసు పెట్టటానికి వచ్చిన దళితుడిని బూటుకాలితో తన్నిన సీఐ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏపీలో దళితులపై పోలీసుల దాష్టీకాలు పలు విమర్శలకు దారితీస్తోంది.పశ్చిగోదావరి జిల్లాలో ఇసుక లారీని అడ్డుకున్న ఓ దళిత యువకుడికి శిరోముండనం..మరో జిల్లాలో మాస్క్ పెట్టుకోలేదని బైక్ పై వెళుతున్న యువకుడిని కొట్టటంతో అతను చనిపోవటం వంటి పలు ఘటన తీవ్ర విమర్శలకు దారితీసిన ఘటనలు మర్చిపోక ముందే శ్రీకాకుళం జిల్లాలో ఓ దళితుడిని సీఐ బూటుకాలితో తన్ని నానా దుర్భాషలు ఆడిగన ఘటన వెలుగులోకి వచ్చింది.ఓ గొడవ విషయంలో కేసు పెట్టేందుకు వెళ్లగా.. తిరిగి అతనిపైనే చేయిచేసుకున్నాడు సీఐ.ఇతంతా అక్కడే ఉన్న స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో సీఐ తీరుపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయటం..అది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లటం అతన్ని సస్పెండ్ చేయటం జరిగాయి.

పలాస మండలం టెక్కలికి చెందిన జగన్ అనే వ్యక్తి ఇళ్ల స్థలాల విషయంలో స్థానిక రాజకీయ నేతలతో గొడవ జరిగింది. ఈ గొడవలో వాళ్లు అతన్ని కొట్టారు. దీంతో అతను తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసు స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసే సమయంలో కాశిబుగ్గ సీఐ వేణుగోపాల్ రావు విషయాలను ఆరా తీశాడు. కేసు పెట్టటానికి వచ్చిన బాధితుడి దగ్గర ఫిర్యాదు తీసుకోలేదు సరికదా..తిరిగి అతన్ని ఇష్టాను సారంగా నానా దర్భాషలాడాడు. అంతటితో ఊరుకోకుండా బూటుకాలితో బలంగా తన్నాడు. దీంతో అతడు భయంతో వెనక్కి వెనక్కి నడుచుకుంటూ వెళ్లాడు. అక్కడే అతని తల్లి నా కొడుకును కొట్టకండీ బాబూ అంటూ వేడుకుంది. బాధితులపైనే తిరగి దాడులు చేయటం ఏంటీ అంటూ విమర్శలకు దారితీస్తున్న క్రమంలో సీఐను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు.

Related Posts