లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

కరోనా సోకకుండా ‘మంత్రించిన కషాయం’తీసుకున్న ఆరోగ్యశాఖ మంత్రికి పాజిటివ్..!!

Published

on

Srilanka health minister  corona tests positive : కరోనా వైరస్ వైరస్ సోకకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఆరోగ్య శాఖా మంత్రి కరోనా బారిని పడ్డారు. ఇది పెద్ద విషయం కాదు. కానీ కరోనా సోకకుండా ఉండేదుకు సదరు ఆరోగ్య శాఖా మంత్రిణి మహిమగల ‘మంత్రించిన కషాయం’ తీసుకున్న ఆ మంత్రికి కరోనా సోకింది. పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది..!! దీంతో ఆమెపై జనాలు ట్రోలింగ్ చేస్తున్నారు. ‘మంత్రిగారు తీసుకున్న కషాయంలో మహిమలు లేవనుకుంటా’..అంటూ సెటైర్లు వేస్తున్నారు.

మన పొరుగున ఉన్న దేశం శ్రీలంక ఆరోగ్య శాఖ మంత్రి ‘పవిత్ర వానియరాచ్చి’..కరోనాతో పోరాడేందుకు ఓ ‘మ్యాజిక్ సిరప్’ (మహిమగల మంత్రించిన కషాయం) తీసుకున్నారు. ఇది తెలిసిన జనాలు ఊరుకుంటారా? ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఓ ఆరోగ్య మంత్రి.. ఇటువంటి పనులేంటీ? అంటూ ఏకిపడేశారు. పైగా ఆమెకు కరోనా పాజిటివ్ రావటంతో మహిమలు పనిచేయలేదనుకుంటా..మరోసారి ప్రయత్నించకూడదూ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఆమెకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన తరువాత ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఓ మంత్రి.. ఇలాంటి పిచ్చి పనులను ప్రోత్సహించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

కరోనాను అంతం చేస్తానంటూ ఓ సన్యాసి మంత్రి ‘పవిత్ర వానియరాచ్చి’ కి ఓ కషాయం ఇచ్చారు. అది తాగితే కరోనాయే కాదు ఎటువంటి వైరస్ లు సోకవని చెప్పాడు. ఆ కషాయాన్ని ఓ ప్రత్యేకమైన నీటితో ఓ కుండలో పోసి తయారు చేశానని చెప్పాడు. అది నమ్మిన మంత్రి ఆ కషాయాన్ని తాగారు..అయినా సరే..పాజిటివ్ రావటంతో జనాలు ఆమెకు కరోనా వచ్చిందనే సింపతీకూడా లేకుండా సెటైర్లతో ఆడేసుకుంటున్నారు.

కాగా..సాక్షాత్తూ మంత్రిగారే మంత్రించిన కషాయం తీసుకుంటే కొంతమమంది జనాలు ఊరుకుంటారా? ఆమెతో పాటు చాలామంది అధికారులు కూడా ఈ మంత్రించిన కషాయాన్ని తీసుకున్నారు. దీంతో సామాన్య ప్రజలు కూడా  ఈ కషాయం కోసం ఎగబడ్డారు. ఇది లభించే కగల్లె టౌన్‌లో వేలసంఖ్యలో గుమిగూడారు. ఇదంతా గత డిసెంబరులో జరిగింది. అయితే తాజాగా ఆరోగ్యమంత్రి  పవిత్రకు కరోనా సోకింది. దీంతో తనను ఇటీవలి కాలంలో కలిసిన వారంతా సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లాలని ఆమె కోరారు. ఇది తెలిసిన  నెటిజన్లు ‘మంత్ర కషాయం పనిచేయలేదా?’ అంటూ మంత్రిపై సెటైర్లు వేసే పనిలో బిజీగా ఉన్నారు.