Srivari Darshan After Lockdown YV Subba Reddy

గోవిందా..గోవిందా : ప్రభుత్వ అనుమతి తర్వాతే..శ్రీ వారి దర్శనం – వైవీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తిరుమల వెంకటేశ్వరుడి స్వామిని ఎప్పుడు దర్శించుకుంటామా ? అని భక్తులు ఎదురు చూస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా గత 60 రోజులకు పైగా…తిరుమల శ్రీ వారి ఆలయంలోకి భక్తులను అనుమతించడం లేదు. స్వామి వారికి జరగాల్సిన నిత్య కార్యక్రమాలు అర్చకులు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ ఎత్తివేతపైనే అందరి దృష్టి నెలకొంది. లాక్ డౌన్ ఎత్తివేసిన అనంతరం దర్శనాలకు అనుమతినిస్తారనే ప్రచారం జరుగుతోంది.

దీనిని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. 2020, మే 28వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు ఛైర్మన్ సుబ్బారెడ్డి అధ్యక్షతనలో TTD పాలకమండలి కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీటీడీ ఈవో అనీల్ కుమార్ సింఘాల్ మరికొంత మంది సభ్యులు పాల్గొన్నారు. అనంతరం వైవీ మీడియాతో మాట్లాడారు. స్వామి వారి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. లాక్ డౌన్ సడలింపు తర్వాత దర్శనానికి ఏర్పాట్లు చేస్తామన్నారు.

భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అనుమతినివ్వగానే స్వామి వారి దర్శనాలు ఉంటాయని ప్రకటించారు. పాత గెస్ట్ హౌస్ లను పునర్ నిర్మించేందుకు మాత్రమే అనుమతినిస్తామని, అతిథి గృహాల కేటాయింపులో పూర్తి పారదర్శకత పాటిస్తామని వెల్లడించారు. డోనేషన్ విధానంలో అతిథి గృహాల కేటాయింపు ఉండేలా…విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. 

ఆలయంలో భక్తులు భౌతిక దూరం పాటించేలా మార్కింగ్ చేయనున్నారు. రోజుకు ఏడు వేల మందిని మాత్రమే అనుమతించేలా ఏర్పాట్లు చేస్తోంది. పరిమిత సంఖ్యలో ఆన్ లైన్ టైం స్లాట్ టోకెన్లు ఇవ్వనున్నారు. అలాగే లాక్ డౌన్ తర్వాత శ్రీవారి పాదాల వరకు ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. శ్రీవారి పాదాల వద్దకు ఆర్టీసీ బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకుగానూ ఘాట్ రోడ్ లో మార్పులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Read: ఆస్తుల అమ్మకంపై TTD పాలక మండలి కీలక నిర్ణయం

Related Posts