The stamps were issued to honour Gandhi's legacy on his 150th birth anniversary

నాలుగు దేశాల్లో గాంధీజీ పోస్టల్ స్టాంపులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భారత జాతిపిత పూజ్య బాపూజీకి విదేశాలలో అరుదైన గౌవరం లభించింది. మహాత్ముడి అడుగుజాడలు..ఆయన ఆదర్శాలు ప్రపంచానికే ఆదర్శనీయమైనవిగా ప్రపంచాధినేతలు సైతం కీర్తించారు. భారతదేశ స్వాతంత్ర్యం సమరంలో అహింసా, శాంతి ఆయుధాలుగా గాంధీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో కీర్తిప్రతిష్టం ఉన్నాయి.

ఈ క్రమంలో మన జాతిపితకు మరో అరుదైన గౌరవం లభించింది. గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలు భారతదేశవ్యాప్తంగా ఘనంగా జరుతున్నాయి. ఈ సందర్భంగా నాలుగు దేశాల్లో గాంధీజీ  పేరిట పోస్టల్ స్టాంపులను విడుదల చేశారు. ఫ్రెంచ్ పోస్టల్ సర్వీసు కంపెనీ గాంధీ చిత్రంతో కూడిన పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. ఫ్రాన్స్ దేశంలో భారత రాయబార కార్యాలయం ఫ్రాన్స్ పోస్టల్ స్టాంపు చిత్రాన్ని అప్ లోడ్ చేస్తూ ట్వీట్ చేసింది.

ఫ్రాన్స్ దేశంతోపాటు ఉజ్బెకిస్థాన్,టర్కీ, పాలస్తీనా దేశాల్లో గాంధీజీ చిత్రంతో పోస్టల్ స్టాంపులను విడుదల చేశాయి. గాంధీజీ 150 వ జయంతోత్సవం సందర్భంగా ప్రపంచదేశాల్లో పలు కార్యక్రమాలు చేపట్టారు.

Related Posts