"Stand With Sushant Singh Rajput's Fans": Salman Khan Requests His Fans On Twitter

తన అభిమానులను సుశాంత్ ఫ్యాన్స్ కు సపోర్ట్ చేయమంటోన్న సల్మాన్ ఖాన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం బాలీవుడ్ మొత్తాన్ని దిగ్భ్రాంతికి లోను చేయడమే కాదు. సానుభూతి వర్షం కురిసేలా చేస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో నెపోటిజంపై విమర్శలు కురిపిస్తుంది. వారం రోజులుగా విమర్శలు ఎదుర్కొంటున్న వారిలో ముఖ్యంగా సల్మాన్ ఖాన్ కూడా ఉన్నారు. ఈ ఎఫెక్ట్‌తో ఓ వారంపాటు సల్మాన్ ఖాన్ ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారిపోయాడు. సుశాంత్ ఫ్యాన్స్ సల్మాన్ పై ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. 

అసలు ఇవేమీ తెలియదన్నట్లు రెస్పాండ్ అయిన సల్మాన్.. ఆదివారం ట్విట్టర్లో ఓ పోస్టు పెట్టాడు. తన ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేస్తూ సుశాంత్ అభిమానులకు సపోర్ట్ చేయమని కోరాడు. భాషతో సంబంధం లేకుండా… శాపాలను పట్టించుకోకుండా ఎమోషన్ తో మాత్రమే మద్ధతు ఇవ్వాలని కోరాడు. 

నా ఫ్యాన్స్ అందరికీ ఒక రిక్వెస్ట్. సుశాంత్ ఫ్యాన్స్ కు సపోర్ట్ చేయండి. వాడిన భాష, పెట్టిన శాపాలను పట్టించుకోకుండా దానికి వెనుక ఉన్న ఎమోషన్ ను అర్థం చేసుకోండి. అతని కుటుంబానికి, అభిమానులకు సపోర్ట్ చేయండి. ప్రియమైన వాళ్లు కోల్పోతే నిజంగా అది చాలా బాధగా ఉంటుంది’ అని సల్మాన్ ట్వీట్ చేశారు. 

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ 14న ముంబైలోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దానిపై విచారణ జరుగుతుంది. వివేక్ ఒబెరాయ్, రవీనా టాండన్, రణవీర్ సోరే. అనుభవ్ సిన్హా, శేఖర్ కపూర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజమ్ కారణంగానే చనిపోయాడని విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత కరణో జోహార్, అలియ్ భట్ లు ట్విట్టర్లో దారుణంగా ట్రోలింగ్ కు గురయ్యారు. 

Related Posts