States Can't Hire Workers From UP Without Permission: Yogi Adityanath

పర్మిషన్ లేకుండా యూపీ వర్కర్లతో పనిచేయించుకోవడానికి వీల్లేదు: యోగి ఆదిత్యనాథ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులతో పనిచేయించుకోవాలనుకుంటే ముందుగా తమ రాష్ట్ర అనుమతి తీసుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అంటున్నారు. లాక్‌డౌన్ పూర్తిగా తొలగించిన తర్వాత లక్షల్లో వలస కార్మికులు పని కోసం ఇతర రాష్ట్రాలకు తిరిగి వెళ్లిపోతారు. వాళ్లు వెళ్లకుండా రాష్ట్రంలోనే వారికి పని కల్పించాలని ఓ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

‘మా ఆఫీసర్లకు సూచనలు ఇచ్చాను. ఉత్తరప్రదేశ్ కార్మికులు ఇక్కడే పనిచేయాలి. బయట రాష్ట్రాల్లో పనిచేయాలనుకుంటే ముందుగా మా అనుమతి తీసుకోవాలి’ అని మీడియాతో ఆన్ లైన్ సమావేశంలో వెల్లడించారు. ‘బయటి రాష్ట్రాలకు వెళ్లాలనుకుంటే వారికి ఇన్సూరెన్స్, సోషల్ సెక్యూరిటీ కల్పిస్తాం. కానీ, అనుమతుల్లేకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్తే సహించం’ అని అననారు. 

లాక్‌డౌన్ సడలింపులు నిదానంగా మొదలయ్యాయి. కర్ణాటక లాంటి రాష్ట్రం వలస కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది. భవన నిర్మాణాలు, పరిశ్రమలు మొదలైతే మళ్లీ వలస కార్మికులకి ఉపాధి లభిస్తుంది. తమిళనాడు వలస కార్మికులను రాకుండా ఆపేసింది. చాలా పరిశ్రమలు జీతాలు ఇవ్వడానికి కూడా తాము సిద్ధంగా లేమని చెప్పేస్తున్నారు. 

ఈ మేరకు యోగి ఆదిత్యనాథ్ కమిషన్ ఏర్పాటు చేసి వలస కార్మికులకు సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వలస కార్మికులు ఎక్కడికి వెళ్లి పని చేయాలనుకున్నా వారికి అండగా నిలుస్తామని చెప్పారు. లాక్‌డౌన్ సడలించడంతో 20లక్షల మంది వలస కార్మికులు ఉత్తరప్రదేశ్ కు తిరిగొచ్చేశారు. 

‘వలస కార్మికుల నుంచి ఇన్ఫెక్షన్ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వారిలో ఇంకా త్వరగా మార్పులు కనిపిస్తున్నాయి. సాధారణ వ్యక్తులు 14-20 రోజులు తీసుకుంటుంటే వలస కార్మికులకు మాత్రం ఏడెనిమిది రోజుల్లో కోలుకుంటున్నారు. ఇది చాలా పాజిటివ్ అంశం’ అని అన్నారు. 

Related Tags :

Related Posts :