Home » స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కన్నా ఐక్యతా విగ్రహం వద్దకే ఎక్కువ మంది టూరిస్టులు
Published
1 month agoon
Statue Of Unity అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ(ఐక్యతా విగ్రహం)వద్దకే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం(జనవరి-17,2021)ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. రెండేళ్ల క్రితం ఓపెన్ చేసిన ఐక్యతావిగ్రహాన్ని ఇప్పటివరకు దాదాపు 50లక్షలమంది సందర్శించారని మోడీ తెలిపారు.
దేశంలోని పలు ప్రాంతాలనుంచి కెవాడియా 8రైళ్లను ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన అనంతరం మాట్లాడిన మోడీ…పెరిగిన కనెక్టివిటీతో ప్రతి రోజూ ఐక్యతావిగ్రహాన్ని 1లక్ష మంది సందర్శిస్తారని ఓ సర్వే చెబుతోందని తెలిపారు. మరోవైపు, కొత్త రైలు కనెక్టివిటీతో అతిపెద్ద లబ్ధిదారులుగా స్థానికులే ఉంటారని మోడీ తెలిపారు. అదేవిధంగా ఈ ప్రాంతంలోని కొన్ని ఆలయాలను సందర్శించే వాళ్లు కెవాడియాకు కొత్త రైళ్ల ద్వారా లబ్ది పొందుతారని అన్నారు.
ప్రస్తుతం కెవాడియా గుజరాత్ లోని ఓ చిన్న మారుమూల ఏరియా కాదని..ప్రపంచంలోనే అతిపెద్ద పర్యాటక గమ్యస్థానంగా మారుతోందని మోడీ తెలిపారు. కరోనా నేపథ్యంలో కొన్ని నెలలపాటు అన్ని మూతపడినప్పటికీ కూడా ప్రస్తుతం కెవాడియాకి వచ్చే టూరిస్టుల సంఖ్య వేగంగా పెరుగుతోందని చెప్పారు. పర్యావరణాన్ని కాపాడుతూ ఓ క్రమపద్దతితో ఎకానమీ మరియు ఎకోలజీ(ఆర్థిక,జీవావరణ)రెండూ అభివృద్ధి కాగలవని చెప్పడానికి ఓ చిన్న…అందమైన కెవాడియా ఓ మంచి ఉదాహరణ అని మోడీ తెలిపారు.
తాజాగా ప్రారంభించిన రైలు కనెక్టివిటీతో ఐక్యతావిగ్రహాన్ని సందర్శించేవాళ్లు లబ్ది పొందుతారని,కానీ ఈ కనెక్టివిటీ కెవాడియా ప్రజల జీవితాలనే మార్చేయబోతుందని అన్నారు. కనెక్టివిటీ ద్వారా కొత్త ఉద్యోగ అవకాశలు,స్వయం ఉపాధి లభిస్తుందని మోడీ చెప్పారు. ఈ రైలు మార్గం..కర్నాలి,పోయిచా,గురుడేశ్వర్ వంటి ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రేదేశాలను కూడా కనెక్ట్ చేస్తుందని చెప్పారు. ఈ ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక వైబ్రేషన్ తో నిండిపోతుందనేది నిజమని మోడీ అన్నారు.
రాహుల్ గాంధీ స్విమ్మింగ్.. వీడియోలు వైరల్
ఏపీ, తెలంగాణ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో పట్టాలపైకి మరో 22 ప్రత్యేక రైళ్లు
ఏకంగా మినిష్టర్ కారుతో రేస్ పెట్టుకున్న టూరిస్టులు
మార్చి 7 లోగా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు : మోడీ
పాత కథల్లో ఉండే అహంకార రాజులాంటివాడే మోడీ
చదువుకున్నోళ్లే హింసను ప్రేరేపిస్తున్నారు