లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

తమిళనాడులో 42 ఏళ్ల క్రితం చోరీ అయిన విగ్రహాలు లండన్ లో లభ్యం

Published

on

Statues of stolen found in London : తమిళనాడులో 42 ఏళ్ల క్రితం చోరీ అయిన విగ్రహాలు లండన్ లో లభ్యం అయ్యాయి. నాగపట్నం జిల్లా అనంతమంగళం రాజగోపాలస్వామి ఆలయంలో 1978 లో దుండగులు మూడు విగ్రహాలను చోరీ చేశారు. 15 వ శతాబ్ధానికి చెందిన రాముడు, సీత, లక్ష్మణ, ఆంజనేయుడి విగ్రహాలను చోరీ చేశారు. అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేశారు.అప్పటికే దేశం దాటి పోవడంతో విగ్రహాలను గుర్తించలేకపోయారు. స్వచ్ఛంద సంస్థ సహకారంతో లండన్ లో మూడు విగ్రహాలు లభ్యం అయ్యాయి. నిన్న రాత్రి లండన్ నుంచి మన దేశానికి విగ్రహాలు చేరుకున్నాయి. మూడు విగ్రహాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు.అంతర్జాతీయ మార్కెట్‌లో కళాఖండాల వ్యాపారాన్ని పర్యవేక్షించే సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ నుంచి వచ్చిన సమాచారం మేరకు దొంగిలించబడిన నాలుగు విగ్రహాలలో మూడు విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో లండన్‌లోని ఒక పురాతన వస్తువులను సేకరించే వ్యక్తి వద్ద నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.శుక్రవారం తమిళనాడు సీఎం పళనిస్వామి చెన్నైలోని విగ్రహాలను పరిశీలించి.. వాటిని అధికారికంగా ఆలయ కార్యనిర్వాహక అధికారి శంకరేశ్వరికి అప్పగించారు. త్వరలో రాజగోపాలస్వామి ఆలయంలో మళ్లీ విగ్రహాను ప్రతిష్టాపన చేయనున్నారు.