Stones attack on Telangana RTC bus

తెలంగాణ ఆర్టీసీ బస్సుపై రాళ్లతో దాడి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఓవైపు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మరోవైపు బస్సులపై దాడులు జరుగుతున్నాయి. కొత్తగా వచ్చిన తాత్కాలిక డ్రైవర్లు పని సరిగ్గా రాక యాక్సిడెంట్లు చేస్తున్నారు. తాత్కాలిక డ్రైవర్లుపై కూడా దాడికి దిగుతున్న సంధర్భాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో తెలంగాణ ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు.

బోనకల్లు నుంచి ఖమ్మం వెళుతున్న ఆర్టీసీ బస్సుపై గాంధీనగర్‌ సమీపంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు రాళ్లతో కొట్టారు. బస్సు గాంధీనగర్ దాటిన తర్వాత రాత్రి 7 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ దాడిలో తాత్కాలిక డ్రైవర్‌ రామకృష్ణ చెవి, కంటికి గాయాలు అయ్యాయి.

బస్సు ముందుభాగంలో అద్దం పగిలింది. గాయపడిన డ్రైవర్‌ను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. బస్సులో ఉన్న ఇతర ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానానికి చేర్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

Related Posts