లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

దారుణం జరిగిపోయింది : అబార్షన్ వికటించి విద్యార్థిని మృతి.. పరారీలో డాక్టర్

చిత్తూరు జిల్లా నగరి అర్బన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అబార్షన్ వికటించి విద్యార్థిని చనిపోయింది. దీంతో భయపడిన ప్రియుడు, ఆపరేషన్ చేసిన ఆర్ఎంపీ డాక్టర్

Published

on

student dies as abortion goes wrong

చిత్తూరు జిల్లా నగరి అర్బన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అబార్షన్ వికటించి విద్యార్థిని చనిపోయింది. దీంతో భయపడిన ప్రియుడు, ఆపరేషన్ చేసిన ఆర్ఎంపీ డాక్టర్

చిత్తూరు జిల్లా నగరి అర్బన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అబార్షన్ వికటించి ఎంబీఏ విద్యార్థిని చనిపోయింది. ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్ చేసిన ఆర్ఎంపీ డాక్టర్ పారిపోయింది. నగరికి చెందిన విజయ్, ఎంబీఏ విద్యార్థిని భువన ప్రేమించుకున్నారు. కొన్ని రోజుల క్రితం యువతి గర్భం దాల్చింది. దీంతో కంగారుపడిన ప్రియుడు విజయ్ ఆమెకి అబార్షన్ చేయించాలని నిర్ణయించాడు. దేవీ అనే ఆర్‌ఎంపీ డాక్టర్‌ను సంప్రదించాడు. అబార్షన్ చేసేందుకు ఒప్పుకున్న ఆర్‌ఎంపీ డాక్టర్ దేవీ.. క్లినిక్ లో ఆపరేషన్ చేసి పిండం తీస్తుండగా తీవ్ర రక్తస్రామైంది. దీంతో యువతి మృతి చెందింది.

పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో ఆర్ఎంపీ డాక్టర్ దేవీ పారిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. డాక్టర్ కోసం గాలిస్తున్నారు. యువతి ఇంట్లో విషాద చాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

భువన పుత్తూరులోని వెంకట పెరుమాళ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంబీఏ ఫస్టియర్ చదువుతోంది. విజయ్ అదే కాలేజీలో చదువుతున్నాడు. భువన గర్భవతి కావడంతో ప్రేమ వ్యవహారం బయట పడకుండా అబార్షన్ చేయించేందుకు యత్నించాడు ప్రియుడు విజయ్. కథ అడ్డం తిరిగి మొత్తానికే మోసం వచ్చింది. నిండు ప్రాణం పోయింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *